మీరు నిరుద్యోగులా..? ఎయిర్ పోర్ట్ ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారా..? అయితే అలాంటి సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది. విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 495 పోస్టులను భర్తీ చేయనున్నారు. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీ మ్యాన్ వంటి విభాగాలు ఉన్నాయి. ఆసక్తి, అర్హతలున్నవారు ఏప్రిల్ 17 నుంచి 20 వరకు నిర్వహించే వాక్‌ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 495
పోస్టుల వివరాలు:
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్(10+2+3) పూర్తి చేసిన వారు అర్హులు. ఎయిర్‌లైన్/ఏవియేషన్ గ్రాడ్యుయేషన్ లేదా ఎయిర్‌లైన్ డిప్లొమా లేదా సర్టిఫైడ్ కోర్సులు చేసిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 28, ఓబీసీ అభ్యర్థులు 31, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.25,980 వేతనంగా చెల్లిస్తారు.
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులు. ఎయిర్‌లైన్/ఏవియేషన్ గ్రాడ్యుయేషన్ లేదా ఎయిర్‌లైన్ డిప్లొమా లేదా సర్టిఫైడ్ కోర్సులు చేసిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 28, ఓబీసీ అభ్యర్థులు 31, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.23,640 వేతనంగా చెల్లిస్తారు.
అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్/ ఎలక్ట్రికల్/ ప్రొడక్షన్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్ విభాగాల్లో మూడేళ్ళ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. అలాగే, అభ్యర్థులు ట్రేడ్ టెస్టుకు హాజరయ్యే సమయంలో తప్పనిసరిగా ఒరిజినల్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ తో హాజరుకావాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 28, ఓబీసీ అభ్యర్థులు 31, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.25,980 వేతనంగా చెల్లిస్తారు.
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు అర్హులు. అలాగే, అభ్యర్థులు ట్రేడ్ టెస్టుకు హాజరయ్యే సమయంలో తప్పనిసరిగా ఒరిజినల్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ తో హాజరుకావాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 28, ఓబీసీ అభ్యర్థులు 31, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.23,640 వేతనంగా చెల్లిస్తారు.
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు అర్హులు. అలాగే, అభ్యర్థులకు తప్పనిసరిగా ఇంగ్లీష్ భాషపై పట్టుండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 28, ఓబీసీ అభ్యర్థులు 31, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.23,640 వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.500.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది