మీరు సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారా..? మంచి ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం కోసం వేచిచూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఐటీ కంపెనీ దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న అప్లికేషన్ డెవలప్‌మెంట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలనుకుంటున్నవారికి ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో అప్లికేషన్ డెవలప్‌మెంట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు అందుకు అర్హులు. ఫ్రెషర్స్‌తోపాటు ఏడాది అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా ఎంపిక చేస్తారు..? దరఖాస్తు ఎలా చేయాలి..? జీతభత్యాలు ఎలా ఉంటాయి..? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
విభాగాలు: అప్లికేషన్ డెవలప్‌మెంట్ అసోసియేట్
అర్హతలు: సీఎస్‌ఈ/ ఐటీ విభాగాల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ/ ఎంఎస్‌సీ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
పని అనుభవం: ఫ్రెషర్స్ మొదలుకొని 11 నెలలు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం: అసెస్‌మెంట్ ప్రాసెస్, మాక్ అసెస్‌మెంట్, కాగ్నిటివ్ & టెక్నికల్ అసెస్‌మెంట్, కోడింగ్ అసెస్‌మెంట్(సి,సి++, డాట్ నెట్,జావా, పైథాన్) ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పని చేయవలిసిన ప్రదేశాలు: ఎంపికైన వారు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె, గురుగావ్, కోల్‌కతా తదితర ప్రదేశాల్లో పని చేయాల్సి ఉంటుంది.
జీతభత్యాలు: ఏటా రూ.4,61,200 వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఉద్యోగ బాధ్యతలు: క్లయింట్లకు అవసరమైన టెక్నాలజీలను రుపొంచించడం, వారి అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిష్కారాలను అందించడం. దీంతో పాటు ఆటోమేషన్ సొల్యూషన్స్, ఫంక్షనాలిటీ, టెక్నాలజీలపై అవగాహన ఉండాలి.