మంచి ఉద్యోగంతో జీవితంలో స్థిరపడాలని యువత కోరుకుంటుంది. అయితే కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల చేస్తూ మంచి జీతం ఆర్జించాలని అనుకుంటారు. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాల పొందటమే లక్ష్యంగా పెట్టుకుంటారు. తమ లక్ష్యాన్ని అందుకునేందుకు నిరుద్యోగులు పట్టుదలతో శ్రమిస్తుంటారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి వెలువడే ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ డీఎఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కాలేజిల్లో మొత్తం 1458 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తికీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ లోని ఏపీ డీఎఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కాలేజిల్లోని 49 స్పెషాలిటీల్లో 1458 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పోస్ట్ గ్రాడ్యూయేషన్ లో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు. నవంబరు 19.. దరఖాస్తులకు చివరి తేదీ. ఇక 1458 పోస్టులకు ఏఏ విభాగాల్లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. జనరల్ మెడిసన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్ టీ, డెర్మటాలజీ, రెస్పిరేటరీ, మెడిసిన్, సైకియాట్రి, రేడియో డయాగ్నోసిస్ , ఎమెర్జెన్సీ మెడిసిన్, డెంటల్ సర్జీరి, రేడియో థెరపీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇంకా..బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, సీవీటీ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, నియోనాటాలజీ, ఓరల్ పాథాలజీ, ఎండోడొంటిక్స్, ఆర్థోడాంటిక్స్, పెడోడాంటిక్స్, ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, కమ్యూనిటీ డెంటిస్ట్రీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, ఓరల్ మాక్సియోల్లో ఫేషియల్ సర్జరీ వంటి విభాగాలతో పాటు మరికొన్ని వాటిల్లో పోస్టులు ఖాళీలిగా ఉన్నాయి. ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్ స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగాల్లో ఎంసీహెచ్/డీఎం/ఎండీ/ఎండీఎస్ /ఎంఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన స్థానికులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వయోపరిమితి విషయానికి వస్తే.. పోస్టుల వారీగా అభ్యుర్ధుల వయసు గరిష్టంగా 45 ఏళ్లకు మించకూడదు.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది.
జనరల్ అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.250లకు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
విద్యార్హతలు, రిజర్వేషన్, స్థానికత, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.65,000 – రూ.85,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్ధులు పూర్తి సమాచారం కోసం https://dme.ap.nic.in/ అనే వెబ్ సైట్ లో చూడండి.