నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. లక్ష 78 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ వివరాలు మీ కోసం.
నిరుద్యోగులకు శుభవార్త. లక్షా 78 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ టీచర్ పోస్టులకు స్థానికులే కాకుండా ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చునని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. గతంలో బీహార్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులకు బీహార్ రాష్ట్రానికి చెందిన వారినే తీసుకునేవారమని.. ఈసారి బయట రాష్ట్రాల వారిని కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో అర్హత కలిగిన భారత పౌరులు ఎవరైనా 1.78 లక్షల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో మొత్తం 1,78,026 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 85,477 ప్రైమరీ టీచర్లు, 1745 మాధ్యమిక టీచర్లు, 90,804 హైస్కూల్ టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.