సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో బౌలర్లు బాల్ ఎక్కడ వేస్తారో కూడా బ్యాటర్లకు తెలీదు. అలాంటిది టీమిండియా స్టార్ బౌలర్ అయిన యజ్వేంద్ర చాహల్ బౌలింగ్ కు దిగితే.. బాల్ ఎక్కడ వేస్తాడో అతడి భార్యకు తెలుసు. ఈ విషయాన్ని స్వయంగా చాహలే చెప్పుకొచ్చాడు.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో బౌలర్లు బాల్ ఎక్కడ వేస్తారో కూడా బ్యాటర్లకు తెలీదు. అలాంటిది టీమిండియా స్టార్ బౌలర్ అయిన యజ్వేంద్ర చాహల్ బౌలింగ్ కు దిగితే.. బాల్ ఎక్కడ వేస్తాడో అతడి భార్యకు తెలుసు. ఈ విషయాన్ని స్వయంగా చాహలే చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా స్టార్ కపుల్స్ లో యజ్వేంద్ర చాహల్-ధన శ్రీ వర్మలు ఒకరు. వీరిద్దరు సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటారు. ప్రత్యేకించి ధన శ్రీ వర్మ అయితే తన డ్యాన్స్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీరిద్దరు విడిపోతున్నారు అంటూ.. కొన్ని రోజుల క్రితం వార్తలు రాగా.. వాటిని కొట్టిపారేశారు ఈ జంట. ఇక తాజాగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో సందడి చేసింది ధన శ్రీ వర్మ. తన భర్త బౌలింగ్ చేస్తుంటే ఉత్సాహపరుస్తూ.. సందడి చేసింది. ఈ మ్యాచ్ లో దుమ్మురేపాడు చాహల్. తాజాగా ఓ వీడియోలో తన భార్యకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
యజ్వేంద్ర చాహల్.. టీమిండియాలో స్టార్ స్పిన్నర్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ లో తొలిమ్యాచ్ లోనే దుమ్మురేపాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్.. సన్ రైజర్స్ మ్యాచ్ లో సత్తా చాటాడు. దాంతో రాజస్థాన్ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మ్యాచ్ చూడ్డానికి చాహల్ భార్యా ధన శ్రీ కూడా వచ్చింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా తన భార్య గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు చాహల్. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో చాహల్ తన భార్య గురించి ఈ విధంగా మాట్లాడాడు..
“ధన శ్రీ నాతో ఉంటే నాకెంతో ధైర్యంగా ఉంటుంది. నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇక నా మ్యాచ్ జరుగుతుంటే.. తను స్టాండ్స్ లో ఉండటం నాకు ఇష్టం. ధన శ్రీ తన ఆటను చూసి ఎంకరేజ్ చేస్తూనే.. నా ఆటను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అదీకాక కొన్ని సందర్భాల్లో నేను బాల్ ఎక్కడ వేస్తానో కూడా చెప్పగలదు” అంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. తను నా పక్కన ఉంటే చాలు అని, ఇంకేమీ అవసరం లేదు అంటూ భార్యపై ప్రశంసలు కురిపించాడు ఈ స్టార్ స్పిన్నర్. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ తన అఫీషియల్ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
Goals! 💗💗💗 pic.twitter.com/EKT7nDBHsd
— Rajasthan Royals (@rajasthanroyals) April 4, 2023
💗💗💗 pic.twitter.com/zdHh2WAzAW
— Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023