భారత క్రికెట్లో ఒక కొత్త కెరటం దూసుకొస్తున్నాడు. ధనాధన్ లీగ్ ఐపీఎల్లో రన్స్ వరద పారిస్తూ.. సెలెక్టర్ల తలుపులు గట్టిగా తడుతున్నాడు. అతడే రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్.
ఈ ఏడాది ఐపీఎల్లో భీకర ఫామ్‌లో ఉన్న ప్లేయర్లలో యశస్వీ జైస్వాల్ ఒకడు. ఈ యంగ్ ప్లేయర్‌కు బౌలింగ్ చేయాలంటే స్టార్ బౌలర్లు కూడా భయపడుతున్నారు. ఫోర్లు, సిక్సులతో బౌలర్లను ఊచకోత కోస్తున్నాడీ లెఫ్టాండర్ బ్యాటర్. గురువారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోమారు తన విశ్వరూపం చూపించాడు జైస్వాల్. ఈ మ్యాచ్‌లో 47 బాల్స్‌లో ఏకంగా 98 రన్స్ బాదాడు. హాఫ్ సెంచరీ మార్క్‌ను కేవలం 13 బాల్స్‌లో చేరుకుని రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు జైస్వాల్. కానీ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసే ఛాన్స్‌ను అతడు తృటిలో కోల్పోయాడు. 98 రన్స్ కొట్టిన జైస్వాల్.. సెంచరీ మార్క్‌ను చేరుకుంటే రాజస్థాన్ ఆటగాళ్లతో పాటు అభిమానులు మరింత సంతోషపడేవారు. అయితే దీనికి కేకేఆర్ స్పిన్నర్ సుయాశ్ శర్మనే కారణమని కొందరు అంటున్నారు.
యశస్వీ జైస్వాల్ సెంచరీని అడ్డుకునే ఉద్దేశంతో సుయాశ్ శర్మ వైడ్ వేశాడని రాజస్థాన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మ్యాచ్ 13వ ఓవర్లో లాస్ట్ బాల్ పడే ముందు రాజస్థాన్ 147 రన్స్‌తో విజయానికి 3 రన్స్ దూరంలో ఉంది. అప్పటికి జైస్వాల్ స్కోరు 94. మరో సిక్స్ కొడితే అతడి ఖాతాలో వరుసగా రెండో సెంచరీ పడేది. క్రీజులో ఉన్న శాంసన్ ఆ ఒక్క బాల్‌కు భారీ షాట్ కొట్టకుండా ఉంటే.. తర్వాతి ఓవర్లో జైస్వాల్ వచ్చి సెంచరీ పూర్తి చేస్తాడని భావించాడు. కానీ కేకేఆర్ స్పిన్నర్ సుయాశ్.. ఆఖరి బాల్‌ను వైడ్ వేసేందుకు ప్రయత్నించాడు. ఆ బాల్ బ్యాట్స్‌మన్‌కే కాదు.. కీపర్‌కు కూడా అందకుండా బౌండరీకి వెళ్లే ఛాన్స్ ఉండేది. దీంతో జైస్వాల్ 94 రన్స్ దగ్గరే ఉండిపోయేవాడు. అయితే సుయాశ్ వేసిన బాల్ ఎటు వెళ్తుందో గమనించిన శాంసన్ ఎక్స్ట్రా రన్ రాకుండా.. ఆ బాల్‌ను ఎదుర్కొని రన్ తీయలేదు.
అనంతరం జైస్వాల్ వైపు చూస్తూ సిక్స్ బాదేయ్ అంటూ సైగ్ చేశాడు సంజూ శాంసన్. తర్వాతి ఓవర్లో శార్దూల్ ఠాకూర్ ఫస్ట్ బాల్‌ను వైడ్ యార్కర్‌గా వేసే ప్రయత్నం చేశాడు. అయితే జైస్వాల్ దాన్ని స్క్వేర్ లెగ్ వైపు బౌండరీ కొట్టి రాజస్థాన్‌కు విక్టరీని అందించాడు. దీంతో అతడు 98 రన్స్ వద్దే ఆగిపోయాడు. దీనిపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఘాటుగా స్పందించాడు. జైస్వాల్ సెంచరీ చేయకుండా అడ్డుకునేందుకు సుయాశ్ వైడ్ బాల్ వేసేందుకు ప్రయత్నించడం కరెక్ట్ కాదన్నాడు. ఇది చెడు ఆలోచన అని ఆయన చెప్పాడు. విరాట్ కోహ్లీ సెంచరీ చేయకుండా ఒక పాకిస్థాన్ బౌలర్ ఇలా చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించాడు. కాగా, దీనిపై మ్యాచ్ అనంతరం జైస్వాల్ స్పందించాడు. సెంచరీ చేయాలనేది తన ఆలోచన కాదన్నాడు. నెట్ రన్‌రేట్‌ను దృష్టిలో ఉంచుకుని వేగంగా ఆడానన్నాడు.
This is Sanju Samson, RR Captain
He is not a regular member of ICT, both Yashasvi and Sanju are fighting for opening spot in ICT.
Jaiswal was batting on 94, Suyash bowled, It was going for a wide & four then Samson defended it for Jaiswal so that Jaiswal can complete his… pic.twitter.com/zfMO4o76LG
— Dr Nimo Yadav (@niiravmodi) May 11, 2023
Trying to bowl a wide to prevent Yashasvi from getting to his 100….poor taste IMHO.
— Aakash Chopra (@cricketaakash) May 11, 2023