క్రికెట్లో బౌలర్లు అన్నాక వికెట్లు తీయడమే కాదు కొన్ని సందర్భాల్లో బ్యాట్స్‌మెన్ హిట్టింగ్‌కు బలవ్వాల్సి వస్తుంది. అయితే అందులో నుంచి బయటపడటం అంత సులువు కాదు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ యష్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది.
క్రికెట్ పూర్తిగా బ్యాట్స్‌మెన్ గేమ్‌గా మారుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో మ్యాచ్‌లు చూసేందుకు గంటలకు గంటలు కేటాయించే పరిస్థితిలో ప్రేక్షకులు లేరు. అందుకే రోజుల తరబడి సాగే సంప్రదాయ టెస్టు క్రికెట్ ప్రాభవం కోల్పోతోంది. మ్యాచ్‌కు ఏడెనిమిది గంటలు పట్టే వన్డే క్రికెట్‌కు కూడా క్రమంగా ఆదరణ తగ్గుతోంది. ఇప్పుడంతా టీ20ల ఫీవరే నడుస్తోంది. మూడు గంటల్లో ముగిసే 20-20 ఫార్మాట్‌కు అందరూ అలవాటు పడ్డారు. మున్ముందు టీ10 ఫార్మాట్ హవా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఫార్మాట్లకు తగ్గట్లుగా ఫ్లాట్ పిచ్‌లను రూపొందిస్తున్నారు. దీంతో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి.
బ్యాట్స్‌మెన్‌కు సహకరించే పిచ్‌ల వల్ల భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. హై స్కోరింగ్ మ్యాచ్‌ల వల్ల ప్రేక్షకులకు కూడా మంచి వినోదం అందుతోంది. అయితే బౌలర్ల పరిస్థితి మాత్రం రోజురోజుకీ దిగజారుతోంది. ఫ్లాట్పిచ్లు, ఆధునిక బ్యాట్ల వల్ల బాల్ కొడితే ఫోర్ లేదంటే సిక్స్ అనేలా పరిస్థితి తయారైంది. బ్యాట్స్‌మెన్ అటాక్ చేస్తుండటం వల్ల పేరున్న బౌలర్లు కూడా భారీగా రన్స్ సమర్పించుకుంటున్నారు. అయితే అనుభవజ్ఞులు ఇందులో నుంచి కోలుకుని తిరిగి రాణిస్తున్నారు. కానీ యువ బౌలర్లకు మాత్రం ఇది కఠిన పరీక్షగా మారింది. ఫెయిల్యూర్స్‌ను అధిగమించడం వారికి చాలా కష్టమవుతోంది. ఇందుకు గుజరాత్ టైటాన్స్ పేసర్ యష్ దయాలే ఉదాహరణగా చెప్పొచ్చు.
కోల్‌కతా హిట్టర్ రింకూ సింగ్ దెబ్బకు యష్ దయాల్ బలయ్యాడు. అతడి ఒకే ఓవర్లో రింకూ 5 సిక్సులు కొట్టడంతో యష్ మైండ్ బ్లాంక్ అయింది. ఆ మ్యాచ్ అనంతరం గ్రౌండ్‌లోనే ఏడ్చేసిన యష్.. ఆ తర్వాత అనారోగ్యానికి గురయ్యాడట. 10 రోజుల వరకు ఆ బాధ నుంచి అతడు కోలుకోలేదట. కేకేఆర్ మ్యాచ్ తర్వాత తీవ్ర ఒత్తిడికి గురైన యష్ అమాంతం 8 నుంచి 9 కిలోలు బరుగు తగ్గాడని గుజరాత్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు. అయితే కమ్‌బ్యాక్ కోసం యష్ తీవ్రంగా శ్రమిస్తున్నాడని పాండ్యా చెప్పాడు. అతడు త్వరలోనే జట్టులోకి తిరిగి వస్తాడని, రాణిస్తాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా, యష్ స్థానంలో సీనియర్ పేసర్ మోహిత్ శర్మ గుజరాత్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. మరి.. యష్ దయాల్ బలంగా కమ్‌బ్యాక్ ఇస్తాడని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gujarat Titans skipper Hardik Pandya provided a major health update on pacer Yash Dayal.#GujaratTitans #HardikPandya #YashDayalhttps://t.co/7BUqe2emlN
— CricTracker (@Cricketracker) April 26, 2023