గుజరాత్ చేతిలో ఓటమి ద్వారా కప్ కొట్టాలనే బెంగళూరు ఆశలకు నిరాశే ఎదరైంది. దీనితో కోహ్లీ కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇది చూడలేకపోతున్న కోహ్లీ ఫ్యాన్స్ గిల్ తో పాటు అతని చెల్లిని అసభ్యంగా తిట్టారు.
అభిమానం ఉంటే పర్లేదుగాని.. ఆ అభిమానం హద్దులు దాటితే మాత్రం ఆ ప్రభావం ఒక్కోసారి ఇతరుల మీద ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఇలాగే తయారయ్యారు. సాధారణంగా మనం ఇలాంటి సంఘటనలు హీరో అభిమానుల విషయంలో చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ కాస్త క్రికెట్ లోకి వచ్చినట్లుగానే కనిపిస్తుంది. కోహ్లీ, గిల్ ల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో మనకు తెలిసిందే. కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ ఓటమిని జీర్ణించుకోలేక ఏం చేస్తున్నారో వారికే అర్ధం కావడం లేదు. గిల్ ని టార్గెట్ చేయడం తప్పనుకుంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్లి ఏకంగా గిల్ చెల్లిని టార్గెట్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఐపీఎల్ లో నిన్న చిన్నస్వామి స్వామీ వేదికగా రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే బెంగళూరు ఈ మ్యాచులో ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఒకవేళ ఓడిపోతే మాత్రం ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కి వెళ్తుంది. అయితే ఈ మ్యాచ్ గుజరాత్ గెలవడం వలన ఎలాంటి ఉపయోగం లేదు. కానీ ఓపెనర్ గిల్ అజేయ సెంచరీతో చివరి వరకు గ్రీజ్ లో ఉండి మ్యాచ్ ని ఆర్సీబీ దగ్గర నుంచి లాగేసుకున్నాడు. దీంతో కప్ కొట్టాలనే బెంగళూరు ఆశలకు నిరాశే ఎదరైంది. దీనితో కోహ్లీ కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇది చూడలేకపోతున్న కోహ్లీ ఫ్యాన్స్ గిల్ తో పాటు అతని చెల్లిని అసభ్యంగా తిట్టారు.
మ్యాచ్ ముగిశాక గిల్, అతడి సోదరి షానీల్ గిల్ పై తిట్టడంతో పాటుగా.. ట్రోల్స్ చేస్తున్నారు. ఓ కారు యాక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఈ కారులో గిల్ ఉంటే బాగుండు’, ‘కారు ప్రమాదంలో గిల్ మృతి’ అని ఇష్టమొచ్చినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. x @ffsvirat అని రాసి ఉన్న ఫ్రొఫైల్ లో ‘నువ్వూ, నీ ట్రాన్స్‌జెండర్ సోదరి తలలు తెగిపడాలి. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో.. నీ జీవితంలో అన్నీ అపశకునాలే. ఆ మేరకు నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. నీ కంట్లోంచి కారే ప్రతి కన్నీటి బొట్టుకు నా శాపమే కారణం..’ అని ఆగ్రహంగా వ్యక్తం చేశారు. అయితే ఈ పని కోహ్లీ ఫ్యాన్స్ చేసి ఉండరనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.