సన్ రైజర్స్ ఓడిపోయింది. అయితే గెలిచిన దిల్లీ జట్టు కెప్టెన్ వార్నర్ ని చూస్తే.. ఈ మ్యాచ్ తో పగ తీర్చుకున్నాడా అనిపించింది. ఇంతకీ అదేంటో తెలియాలా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
‘గెంటితే గేటు కూడా డబుల్ స్పీడులో వస్తుంది’.. ‘అత్తారింటికి దారేది’లోని బ్రహ్మానందం తన ఎంట్రీ సీన్ లో చెప్పే డైలాగ్ ఇది. ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నామంటే ఐపీఎల్ లో వార్నర్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు దిల్లీ చేతిలో ఓడిపోయింది. చూసుకుంటే ఇది ఓ సాధారణ మ్యాచ్. కానీ వార్నర్ ని సరిగ్గా గమనిస్తే.. మ్యాచ్ లో అతడు ఎమోషన్స్ ని పసగడితే.. కావ్యపాపపై రివేంజ్ తీర్చుకున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఇదే సన్ రైజర్స్ ఫ్రాంచైజీ తనని ఘోరంగా అవమానించింది. ఓ కెప్టెన్ అని చూడకుండా చాలా దారుణంగా బిహేవ్ చేసింది. ఇంతకీ ఏం జరిగింది?
అసలు విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ లేదా ఐపీఎల్ చూసే ప్రతి ఒక్కరూ దాదాపుగా డేవిడ్ వార్నర్ ఫ్యాన్ అయి ఉంటారు. ఎందుకంటే వార్నర్ క్రేజ్ అలాంటిది. అటు క్రికెట్ పరంగా కావొచ్చు, ఇటు టిక్ టాక్ ఇన్ స్టా రీల్స్ తో కావొచ్చు ఎప్పటికప్పుడూ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తూనే ఉన్నాడు. దాదాపు ఐదారేళ్ల పాటు సన్ రైజర్స్ జట్టుకు ఆడిన వార్నర్.. 2016లో ఈ జట్టు కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఎందుకంటే అప్పుడు టీమ్ కెప్టెన్ వార్నరే కాబట్టి. అలాంటి వార్నర్ ని 2021 సీజన్ లో ఫామ్ కోల్పోయాడని చెప్పి పక్కనబెట్టేశారు.
చెప్పాలంటే మరీ ఘోరంగా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ అని కూడా చూడకుండా బౌండరీ లైన్ దగ్గర కూర్చోపెట్టారు. ఆ రోజు వార్నర్ కన్నీళ్లు పెట్టుకోవడం ఇంకా గుర్తున్నాయి. అవి ఇంకా ఇంకిపోలేదనుకుంటా..? ఆ పగే ఇప్పుడు పూర్తిగా తీరిపోయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్సీ చేస్తున్న వార్నర్.. ఈ సీజన్ లో ఫస్ట్ సిక్స్ హైదరాబాద్ పై, అది కూడా నిన్నటి మ్యాచ్ లోనే కొట్టాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత అతడు చేసుకున్న సెలబ్రేషన్స్ చూస్తే.. సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ పై రివేంజ్ తీర్చుకున్నట్లు కనిపించింది. చెప్పాలంటే ఆమెకు దిమ్మతిరిగేలా చేశాడు. ఇదంతా చూసిన క్రికెట్ లవర్స్.. వార్నర్ కు అప్పుడలా చేసి ఇప్పుడు అనుభవిస్తున్నారు అంటూ కావ్యపాపని ట్రోల్ చేస్తున్నారు. సో అది విషయం. మరి వార్నర్ పగ చల్లారడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
The winning celebration from David Warner was special – a win for him at his territory of Hyderabad. pic.twitter.com/6WIIoxMHRW
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2023