Virender Sehwag, David Warner: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పైగా ఓ యువ క్రికెటర్ పేరును ప్రస్తావిస్తూ.. అతన్ని చూసి నేర్చుకోవాలని అన్నాడు.
క్రికెట్‌లో బ్యాటర్ ఫామ్ కోల్పోవడం సహజం. ఫామ్‌లో ఉంటే జట్టులో కొనసాగుతాడు లేదంటే.. జట్టు నుంచి ఉద్వాసన తప్పదు. కానీ ఈ రెండిటికీ భిన్నంగా డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎవరికీ అర్థం కాని రీతిలో ఉంది. అటు ఫామ్ లేదు అని చెప్పలేం..అలాగని చెత్త ప్రదర్శన చేయడం లేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో 158 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన వారి లిస్టులో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ కూడా 50కి పైనే ఉంది. ఇంత చేసిన ఢిల్లీ జట్టు వరుస పరాజయాలకు వార్నర్ కారణమవుతున్నాడు. ఈ విషయంలో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్.. వార్నర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీ20 క్రికెట్‌లో నిలకడ కంటే స్ట్రైక్ రేట్ చాలా కీలకం. ఓవర్లు తక్కువగా.. బ్యాటర్లు ఎక్కువగా ఉండడం వలన వచ్చిన ప్రతి బ్యాటర్ కూడా బ్యాట్ ని ఝళిపించే ప్రయత్నం చేస్తారు. ఇక కొంతమంది బ్యాటర్లు అయితే ప్రారంభంలో కాస్త సమయం తీసుకున్నా..ఆ తర్వాత రెచ్చిపోయి ఆడతారు. కానీ ప్రస్తుత ఐపీఎల్‌లో ఇప్పటివరకు వార్నర్ స్ట్రైక్ రేట్ మాత్రం దారుణంగా ఉండడం గమనార్హం. ఓపెనర్ గా వచ్చి కేవలం 117 స్ట్రైక్ రేట్ తో జట్టుకి భారంగా మారాడు. వార్నర్ కి విధ్వంసకర ఓపెనర్ గా పేరుంది. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. కానీ క్రమంగా ఈ ఆసీస్ ఓపెనర్ పరుగులు వేగంగా చేయడంలో విఫలమవుతున్నాడు. సెహ్వాగ్ సైతం ప్రస్తుతం ఐపీఎల్‌లో వార్నర్ ఆట తీరుని తప్పు పడుతున్నాడు. అతని స్ట్రైక్ రేట్ మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది హెచ్చరించాడు.
సెహ్వాగ్ మాట్లాడుతూ “వార్నర్ దూకుడు పెంచాలి. లేకపోతే ఐపీఎల్ ఆడాల్సిన అవసరం లేదు. నా మాటలు వార్నర్ ని కాస్త బాధించిన పర్లేదు. 25 బంతుల్లో 50 పరుగులు చేయడం జైస్వాల్ నుంచి నేర్చుకో. లేకుంటే.. ఐపీఎల్ ఆడడం మానేయ్. ఇలా 56 బంతుల్లో 65 పరుగులు కొట్టడం వలన జట్టుకి ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వు 30 పరుగులకే ఔటైన బాగుండేది. పావెల్, అభిషేక్ పోరెల్ వచ్చి కాస్త హిట్టింగ్ చేసేవారు”. అని సెహ్వాగ్ కాస్త ఘాటుగానే చెప్పుకొచ్చాడు. రాజస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా వార్నర్ చివరి వరకు చాలా స్లోగా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. వార్నర్ చేసిన ఈ బ్యాటింగ్ వలనే ఢిల్లీ ఓడిపోయిందని చాలా విమర్శలు వచ్చాయి. మరి వార్నర్ విషయంలో సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.
Virender Sehwag gives suggestion to David Warner.#CricketTwitter #cricketnews #Cricket #DavidWarner #IPL2023 #IPL #DelhiCapitals #YashasviJaiswal pic.twitter.com/immZwde1JU
— CricInformer (@CricInformer) April 9, 2023