ఐపీఎల్ లో చెన్నై బ్యాటింగ్ తో పోల్చుకుంటే బౌలింగ్ లో కాస్త బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత మాజీ బ్యాటర్ మాట్లాడుతూ.. ఈ క్రెడిట్ అంతా ధోని ఖాతాలో వేసాడు. అంతే కాకుండా చెన్నై బౌలర్లు బాగా బౌలింగ్ వేయలేదని కామెంట్ చేసాడు.
ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. లీగ్ మ్యాచుల్లో సత్తా చూపిన చెన్నై.. తాజాగా జరిగిన ప్లే ఆఫ్ మ్యాచులో పటిష్టమైన గుజరాత్ టైటాన్స్ మీద ఘన విజయం సాధించి దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో ధోని సేన ఆల్ రౌండ్ షో తో అదరగొట్టేసింది. బ్యాటింగ్ లో ఓపెనర్లు గైక్వాడ్, కాన్వే రాణించగా.. బౌలింగ్ లో అందరు సమిష్టి ప్రదర్శన చేశారు. దీంతో చెన్నై రికార్డ్ స్థాయిలో 10 వ సారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక్కడవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు చెన్నై బౌలింగ్ మీద భారత మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
ఐపీఎల్ లో చెన్నై బ్యాటింగ్ తో పోల్చుకుంటే బౌలింగ్ లో కాస్త బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మరీ దారుణంగా అయితే ఏమి లేదు అని తెలుస్తుంది. జడేజా, పతిరానా, చాహర్ రూపంలో బాగానే ఉంది. అయితే టోర్నీ ఆరంభంలో చెన్నై బౌలింగ్ మాత్రం చాలా చెత్తగా ఉందనే మాట వాస్తవం. ఈ విషయంపై సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఈ క్రెడిట్ అంతా ధోని ఖాతాలో వేసాడు. “ఈ టోర్నీలో చెన్నై బౌలింగ్ దారుణంగా ఉంది. ఆ టీం బ్యాటింగ్ బాగా చేయడం వలెనే ఫైనల్ కి వచ్చింది. ఈ బౌలింగ్ లైనప్ తో చెన్నై ఫైనల్ కి చేరిందంటే అది ధోని వలెనే సాధ్యమైంది. ఇదే బౌలింగ్ వేరే టీంకి ఉంది ఉంటే ప్లే ఆఫ్ కి వెళ్లడం కష్టంగా మారేది”. అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి సెహ్వాగ్ చేనై బౌలర్ల మీద చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.