Virender Sehwag, Shubman Gill: భారత క్రికెట్‌లో యంగ్‌స్టర్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న శుబ్‌మన్ గిల్‌పై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.. చెంప ఛెళ్లు మంటుంది అంటూ..
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కోసం కాకుండా టీమ్ కోసం ఆడాలని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్ కోపానికి కారణం.. ఐపీఎల్ 2023లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గిల్ స్లో బ్యాటింగ్. యువ క్రికెటర్‌గా భారత క్రికెట్‌లో తన మార్క్‌ను చూపిస్తున్న గిల్.. ఇప్పటికే యంగస్టర్ ప్లేయర్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. అయితే.. గురువారం మ్యాచ్‌లో గిల్ హాఫ్ సెంచరీతో సత్తా చాటినప్పటికీ.. కాస్త నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఈ విషయమే సెహ్వాగ్‌కు కోపం తెప్పించింది.
పంజాబ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌కు మంచి స్టార్ట్ లభించింది. ఓపెనర్ గిల్ 49 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 67 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. 22 బంతుల్లోనే 35 పరుగులు చేసిన గిల్.. హాఫ్ సెంచరీ చేసేందుకు 18 బంతులు తీసుకున్నాడు. గిల్ ఇలా హాఫ్ సెంచరీ కోసం మిడిల్ ఓవర్స్‌లో నిదానంగా ఆడినందుకే సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ కష్టపడి గెలిచిందంటూ సెహ్వాగ్ పేర్కొన్నాడు. గిల్ వేగంగా ఆడి ఉంటే.. గుజరాత్‌కు అంత ఒత్తిడికి కావాల్సిన అవసరం ఉండేది కాదని అన్నాడు. ఇలానే ఆటను కొనసాగిస్తే.. ఏదో ఒక రోజు క్రికెట్ గిల్ చెంప ఛెళ్లు మనిపిస్తుందని అన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మ్యాథ్యూ షార్ట్ 36, జితేశ్ శర్మ 25 పరుగులు చేసి రాణించారు. నామమాత్రపు స్కోర్ ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌కు వృద్ధిమాన్ సాహా, గిల్ మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ.. చివర్లో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ 2 బంతుల్లో 4 పరుగులు కావాల్సిన దశకు చేరి.. ఉత్కంఠగా మారింది. రాహుల్ తెవాటియా అద్భుతంగా 19వ ఓవర్ ఐదో బాల్‌కు బౌండరీ కొట్టి మ్యాచ్ గెలిపించాడు.
IPL 2023: Virender Sehwag furious with Shubman Gill batting for personal milestones pic.twitter.com/5sXU1YfvZw
— Times No1 (@no1_times) April 14, 2023