తాజాగా చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబైకి షాక్ ఇస్తూ.. ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగరేసింది. ఇక తన తొలి మ్యాచ్ లోనే టీమిండియా రన్ మెషిన్ విశ్వరూపం చూపించాడు. ఇక ఈ మ్యాచ్ విజయం అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ రచ్చ రచ్చ చేశాడు.
భారీ హంగులతో ప్రారంభమైన ఐపీఎల్ 2023 అభిమానులను అలరిస్తోంది. తొలి మ్యాచ్ నుంచే ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ.. అంచనాలకు తగ్గట్లుగా ముందుకు సాగిపోతోంది. ఈ క్రమంలో తాజాగా చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబైకి షాక్ ఇస్తూ.. ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగరేసింది. ఇక తన తొలి మ్యాచ్ లోనే టీమిండియా రన్ మెషిన్ విశ్వరూపం చూపించాడు. 82 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్ విజయం అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ రచ్చ రచ్చ చేశాడు. అందకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విరాట్ కోహ్లీ.. గ్రౌండ్ లో ఎంత చురుకుగా ఉంటాడో, డ్రెస్సింగ్ రూమ్ లో అంతకంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటాడు. సోషల్ మీడియాలో తన డ్యాన్స్ లతో అభిమానులకు కిక్కెక్కించే కోహ్లీ.. మరోసారి తనలో ఉన్న డ్యాన్సర్ కమ్ ఆర్టిస్ట్ ను చూపించాడు. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 8 వికెట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముంబైపై విజయం సాధించిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ రచ్చ రచ్చ చేశాడు. టీమ్ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేశాడు. తన హావభావాలతో అక్కడ ఉన్న వారందరిని నవ్వించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. జట్టులో తిలక్ వర్మ 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కోహ్లీ, డు ప్లెసిస్ దూకుడుతో.. 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్ లతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ డు ప్లెసిస్ 73 పరుగులతో అతడికి అండగా నిలిచాడు.
The celebration from RCB team and Virat Kohli.🥹❤️pic.twitter.com/pmIyF6DLe1
— Akshat (@AkshatOM10) April 3, 2023