ఆటలో వివాదాలు ఆట తర్వాత విమర్శలు సహజం. ఐపీఎల్ లో భాగంగా నిన్న ఆర్సీబీ, లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. లో స్కోరింగ్ థ్రిల్లర్ లో బెంగళూరు జట్టు అద్భుత విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం పెద్ద గొడవే జరిగింది.అసలు ఈ గొడవకు కారణమేంటి అని పరిశీలిస్తే ?
ఆటలో వివాదాలు ఆట తర్వాత విమర్శలు సహజం. కానీ వీటికంటూ ఒక లిమిట్ ఉంటుంది. కొన్ని సార్లు ఆటగాళ్లు హద్దులు మీరు ప్రవర్తించి భారీ మూల్యం చెల్లించుకుంటారు. నిన్న మ్యాచులో కూడా కోహ్లీ విషయంలో అదే జరిగింది. మొదట నవీన్ ఉల్ హక్ తో గొడవ, ఆ తర్వాత గంభీర్ తో గోడ పెట్టుకొని తగ్గేదే లేదు అన్నట్లుగా ప్రవర్తించాడు. అయితే అందరికీ కోహ్లీ గొడవే కనపడినప్పటికీ సరిగ్గా గమనిస్తే విరాట్ తప్పు లేదనే అనిపిస్తుంది. ప్రత్యర్థి ఆటగాళ్లపై దూసుకెళ్లడం తప్పే అయినా.. ఇందులో అసలు తప్పు నవీన్ ఉల్ హక్, గంభీర్ లదా? అసలు ఈ గొడవకు కారణమేంటి అని పరిశీలిస్తే ?
ఐపీఎల్ లో భాగంగా నిన్న ఆర్సీబీ, లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. లో స్కోరింగ్ థ్రిల్లర్ లో బెంగళూరు జట్టు అద్భుత విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం పెద్ద గొడవే జరిగింది. లక్నో ఇన్నింగ్స్ 17 వ ఓవర్లో నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ మధ్య చిన్న పాటి వివాదాహం చోటు చేసుకుంది. అయితే ఇదే విషయమై లక్నో కెప్టెన్ రాహుల్ కోహ్లీకి సారీ చెప్పాల్సిందిగా కోరాడు. దానికి నవీన్ నేను చెప్పను అని మొండిగా ప్రవర్తించాడు. నవీన్ గతంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ లో షాహిద్ ఆఫ్రిది మీద కూడా గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయమై కైల్ మేయర్స్ కోహ్లీతో మాట్లాడుతుండగా.. వెంటనే గంభీర్ వచ్చి అతనితో మాటలు అనవసరం అని తీసుకొని వెళ్ళాడు. దీనికి విరాట్ ఏమైనా ఊరుకుంటాడా ?తనదైన శైలిలో మాట్లల యుద్ధానికి దిగాడు.
విరాట్ కి అసలే దూకుడెక్కువ అని మనకి తెలిసిందే. ఇలాంటి సమయంలో గంభీర్.. కోహ్లీని ఇలా అవమానించడం అవసరమా ?మాట్లాడుతున్న మేయర్స్ ని ఇలా తీసుకెళ్లడంతో ఇప్పుడు నెటిజన్స్ గంభీర్ ని వేలెత్తి చూపిస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత మ్యాచులో గంభీర్ నోటి మీద వేలేస్తూ చిన్న స్వామి స్టేడియంలో కాస్త అతి చేసాడు. ఇప్పుడు కోహ్లీ వంతు వచ్చింది. అదే రియాక్షన్ తో అదిరిపోయే సమాధానమిచ్చాడు.లెక్కకు లెక్క లెక్క సరిపోయింది. అప్పుడు కోహ్లీ సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు గంభీర్ సైలెంట్ గా ఉంటే సరిపోయేది. కోహ్లీ కూడా మితిమీరిన సెలెబ్రేషన్ అనవసరం అనిపించింది. మొత్తానికి గొడవ జరగడానికి గంభీర్ ప్రధాన కారణమా కాదా అనే సంగతి పక్కన పెడితే అసలు గొడవ ఇక్కడనుంచి ప్రారంభం అయింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Kyle Mayers was talking to Virat Kohli – Gautam Gambhir came and took Mayers away. pic.twitter.com/g3ijMkXgzI
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2023