సాధారణంగా గ్రౌండ్ లో ఫోన్లు ఉపయోగించడం సాధారణంగా మనం చూడం. మ్యాచ్ తర్వాత అయినా కానీ ఇలాంటి సందర్భాలు జరిగిన దాఖలాలు లేవు. కానీ నిన్న జరిగిన మ్యాచులో కోహ్లీ వీడియో కాల్ మాట్లాడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఐపీఎల్ లో భాగంగా నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో బెంగళూరు ఈ మ్యాచులో 8 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. మ్యాచ్ సంగత్ అలా ఉంచితే ఈ మ్యాచులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టి మ్యాచ్ గెలిపించడం అభిమానులకి ఎక్కడ లేని కిక్ ఇచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కోహ్లీ ఐపీఎల్ లో సెంచరీ సాధించడం విశేషం. ఏ నేపథ్యంలో నిన్న గ్రౌండ్ లో మ్యాచ్ అనంతరం అభిమానులు భారీ స్థాయిలో సందడి చేశారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ వీడియో కాల్ మాట్లాడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ నిన్న మర్చిపోలేని రోజుగా చెప్పుకోవచ్చు. ప్లే ఆఫ్ కి ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచులో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 63 బంతుల్లో 4 సిక్సులు 12 ఫోర్ల సహాయంతో 100 పరుగులు చేసాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ ముందువరకు విరాట్ రికార్డ్ సన్ రైజర్స్ మీద చాలా దారుణంగా ఉంది. గతేడాది సన్ రైజర్స్ మీద ఆడిన 2 మ్యాచుల్లో కూడా కొహ్లీ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. కానీ ఈ మ్యాచులో మాత్రం దానికి ప్రతీకారం తీర్చుకుంటూ.. కూల్ గా సెంచరీ కొట్టేసాడు. ఈ సంతోషాన్ని తన భార్య అనుష్క శర్మతో పంచుకున్నాడు.
సాధారణంగా గ్రౌండ్ లో ఫోన్లు ఉపయోగించడం సాధారణంగా మనం చూడం. మ్యాచ్ తర్వాత అయినా కానీ ఇలాంటి సందర్భాలు జరిగిన దాఖలాలు లేవు. కానీ నిన్నా మ్యాచ్ తర్వాత అనుష్క శర్మతో కోహ్లీ వీడియో కాల్ మాట్లాడుతూ కనిపించాడు. ప్రతి మ్యాచుకు అనుష్క శర్మ వచ్చి కోహ్లీని సపోర్ట్ చేయడం మనకి తెలిసిందే. అయితే నిన్న మ్యాచులో అనుష్క శర్మ హాజరు కాకపోవడంతో.. కోహ్లీ వీడియో కాల్ మాట్లాడుతూ కనిపించడం వైరల్ గా మారింది. మరి కోహ్లీ ఇలా అనుష్క శర్మతో వీడియో కాల్ మాట్లాడడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.