Virat Kohli, Sourav Ganguly: కోహ్లీ-గంగూలీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. దాదా విషయంలో కోహ్లీ ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్నా.. కోహ్లీ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా..
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విషయంలో విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా.. కోహ్లీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఐపీఎల్ 2023 సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో గంగూలీని కోపంగా చూడటం, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఢిల్లీ టీమ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న గంగూలీ.. డగౌట్‌లో కూర్చుంటే.. బౌండరీ లైన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ.. దాదాను కోపంగా చూస్తున్న ఫొటోలు, మ్యాచ్ తర్వాత షేక్‌హ్యాండ్ ఇవ్వని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో క్రికెట్ అభిమానులు కోహ్లీపై మండిపడ్డారు. ఒక సీనియర్ ప్లేయర్‌తో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో తనపై ఇంత తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. కోహ్లీ అసలు వెనక్కి తగ్గడం లేదు. పైగా దాదాపై మరింత కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఢిల్లీ-ఆర్సీబీ మ్యాచ్ ఘటన తర్వాత.. గంగూలీని ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ అన్‌ఫాలో చేశాడు. దీంతో.. కోహ్లీ గంగూలీతో బహిరంగంగానే గొడవకు కాలు దువ్వుతున్నల్లు తెలుస్తోంది. కెప్టెన్సీ విషయంలో గంగూలీనే తనకు అన్యాయం చేశాడని కోహ్లీ మనసులో బలంగా నాటుకుపోయిందని, అందుకే ఇలా తన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. భారత టీ20 కెప్టెన్‌గా కోహ్లీనే స్వయంగా తప్పుకున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ కోహ్లీని తప్పించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ రాజీనామా చేశాడు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వన్డే కెప్టెన్సీ నుంచి తనకు చెప్పకుండా తీసేశారని కోహ్లీ ఆరోపించాడు. కొన్ని రోజులకు అంతా ఆ విషయం మర్చిపోయారు. కోహ్లీ కూడా కెప్టెన్సీ విషయాన్ని మర్చిపోయి ఉంటాడని అంతా భావించారు. కానీ.. ఐపీఎల్ సందర్భంగా తన కోపాన్ని వెల్లగక్కుతున్నాడు. అయితే.. కోహ్లీ ప్రవర్తిస్తున్న తీరుపై మాత్రం విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ఒక గొప్ప క్రికెటర్‌గా ఎదిగిన కోహ్లీకి.. ఇలాంటి పనులు తగవని హితవు పలుకుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kohli unfollowed Ganguly on Instagram 🔥🔥🔥 pic.twitter.com/vbkvx3lnCX
— 𝙎𝙋𝙄𝘿𝙀𝙔シ︎ (@Spidey_RCB) April 16, 2023