ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో పటిష్ట ముంబై జట్టును మట్టికరిపించింది. రెండేళ్ల తర్వాత సొతం గడ్డపై అభిమానులను అలరించారు. ఇప్పుడు రెండో మ్యాచ్ కోసం కోల్ కతాలో ల్యాండ్ అయ్యారు. తాజాగా విరాట్ కోహ్లీ- ఆర్సీబీ టీమ్ మెంబర్స్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఆర్సీబీ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. సొంత మైదానంలో జరిగిన తొలి మ్యాచులో పటిష్ట ముంబై జట్టుని చిత్తు చేసి ఆత్మవిస్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోహ్లీసేన తన తర్వాతి మ్యాచ్ కోసం కోల్ కత్తాలో అడుగు పెట్టింది. రేపు కేకేఆర్ తో మ్యాచ్ ఉన్నందున దీనిని కూడా గెలిచి విన్నింగ్ స్ట్రీక్ కొనసాగించాలని బెంగళూరు జట్టు చూస్తోంది. ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఇరు జట్లు కూడా ప్రాక్టీస్ లో చమటోడుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఆర్సీబీ ఆటగాళ్లు డిన్నర్ చేస్తున్న ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
టీంఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అభిమానులకి పండగే. గ్రౌండ్ లో సహచర ఆటగాళ్లను ఎంతగానో ప్రోత్సహిస్తుంటాడు. జట్టులో ఎవరైనా గొప్ప ప్రదర్శన చేస్తే ముందుగా విరాట్ కోహ్లీనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. అయితే.. మైదానంలోనే కాదు.. బయట కూడా కింగ్ సహచర ఆటగాళ్లతో చాలా ఫ్రెండ్లీగా కనిపిస్తాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోనే అందుకు నిదర్శనం. విషయం ఏంటంటే కోహ్లీ తన సొంత రెస్టారెంట్ లో టీమ్ మేట్స్ కి ట్రీట్ ఇచ్చాడు. కోహ్లీతో పాటుగా మ్యాక్స్ వెల్, కెప్టెన్ డుప్లెసిస్, సిరాజ్ ఈ ట్రీట్ లో భాగమయ్యారు. అయితే అదే రెస్టారెంట్ కు ఎందుకు వెళ్లారో తెలుసా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
కోహ్లీ సహచరులను అదే రెస్టారెంట్ కి తీసుకెళ్లడం వెనుక పెద్ద కారణం ఏమీ లేదు. అది కోహ్లీ సొంత రెస్టారెంట్ అనమాట. ఆ విషయం తెలిసిన కొందరు సరదాగా ఈ ప్రశ్నను అడుగుతున్నారు. ఈ ట్రీట్ అనంతరం సరదాగా వీరందరూ ఇలా ఫోటో దిగుతూ కనిపించారు. ఇంక ఐపీఎల్లో కోహ్లీ తన మునుపటి ఫామ్ ని అందుకొని ప్రత్యర్థులకు పరోక్షంగా హెచ్చరికలు పంపాడు. తొలి మ్యాచులో భారీ అర్ధ శతకంతో చివరి వరకు క్రీజ్ లో ఉండి మ్యాచ్ ని గెలిపించాడు. అభిమానులు కూడా ఇదే ఫామ్ కొనసాగించాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఉన్న ఫామ్ కి ఆర్సీబీకి టైటిల్ అందించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే బెంగళూరు అభిమానులను ఎవరూ ఆపలేరు. కోహ్లీ టీంమేట్స్ కి ఇలా విందు ఏర్పాటు చేయడం మీకు ఏవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Virat Kohli & @RCBTweets Boys Enjoyed Great Food & Good Times At #one8commune Kolkata! 👌@imVkohli • #IPL2023 • #ViratGang pic.twitter.com/AO1gB6Q0Mj
— ViratGang (@ViratGang) April 4, 2023