Virat Kohli: ఆర్సీబీకి ముఖ్యంగా కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ పైనే ఆధారపడి ఉంది. అయితే.. డుప్లెసిస్, మ్యాక్సీ మంచి స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నా.. కోహ్లీ మాత్రం
ఐపీఎల్ 2023 కీలక దశకు చేరుకుంది. దాదాపు అన్ని టీమ్స్‌కు ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉండటంతో టోర్నీ మంచి రసవత్తరంగా మారింది. అయితే కొన్ని టీమ్స్ మాత్రం తమ అవకాశాలను తామే దెబ్బతీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్సీబీ విషయంలో ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. అన్ని జట్లు తలో 7 మ్యాచ్‌లు ఆడిన తర్వాత.. సగం టోర్నీ ముగిసింది. ఈ దశలో ఢిల్లీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ఆర్సీబీ పర్వాలేదనిపిస్తోంది. అదే ఊపులో మరికొన్ని విజయాలు సాధించి ఉంటే.. ప్రస్తుతం గుజరాత్ ఉండే స్థానంలో ఆర్సీబీ ఉండేది. కానీ ఇప్పుడు 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 5వ స్థానంలో ఉంది. అన్ని జట్లు ప్లే ఆఫ్స్‌కు పోటీ పడుతుండటంతో ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు కష్టంగానే మారాయి. అయితే.. ఆర్సీబీకి ఈ పరిస్థితి రావడానికి కారణం విరాట్ కోహ్లీ అంటూ ఆ టీమ్స్ అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ స్లో బ్యాటింగే ఆర్సీబీ పరాజయాలకు కారణం అవుతోంది అంటూ విమర్శిస్తున్నాడు.
ఈ ఐపీఎల్‌లో కోహ్లీ పరుగులు చేస్తున్నా.. సరైన స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం లేదు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి రాణించిన కోహ్లీ స్ట్రైక్‌రేట్ విషయంలో మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 46 పరుగులు ఆడిన కోహ్లీ 55 పరుగులు చేశాడు. ఇది వన్డే ఇన్నింగ్స్ అని టీ20 క్రికెట్‌కు అస్సలు సెట్ కాదని కోహ్లీ ఫ్యాన్స్ సైతం ఒప్పుకుంటున్నారు. ఆర్సీబీకి ముఖ్యంగా కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ పైనే ఆధారపడి ఉంది. అయితే.. డుప్లెసిస్, మ్యాక్సీ మంచి స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నా.. కోహ్లీ మాత్రం స్లో బ్యాటింగ్‌తో టీమ్‌కు ఇబ్బందిగా మారుతున్నాడు.
మిగతా జట్లు భారీ స్కోర్లు చేస్తూ.. భారీ టార్గెట్లు ఛేదిస్తూ.. దూసుకుపోతుంటే.. కోహ్లీ మాత్రం కేవలం ఫిఫ్టీల కోసం మాత్రమే ఆడుతున్నట్లు ఉంది. హాఫ్ సెంచరీ వరకు స్లోగా ఆడుతున్న కోహ్లీ.. ఫిఫ్టీ కాగానే వేగంగా ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అవుతున్నాడు. అంతసేపు టైమ్ తీసుకుని ఆడినా.. చివర్లో కొట్టాల్సిన సమయంలో అవుట్ అవుతున్నాడు. అయితే.. ప్రస్తుతం ఆర్సీబీ కీలక దశలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ముఖ్యంగా. 4కి 4 మ్యాచ్‌లు గెలిస్తే.. ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎలాగో మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఇంకాస్త వేగంగా ఆడితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli becomes only the 2nd player in IPL history to complete 50 fifties.
Warner and now King Kohli! pic.twitter.com/cRPD0mnEZG
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 6, 2023