లక్నోతో మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ చూస్తే.. మీకు కచ్చితంగా ఓ డౌట్ వస్తుంది! ఓ కామెంటేటర్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ ఫ్యాన్స్ మధ్య ఇదే డిస్కషన్ కు కారణమైంది.
మీరు కోహ్లీకి అభిమానా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఎందుకంటే అందరూ విరాట్ బ్యాటింగ్ చూసి తెగ మురిసిపోతుంటారు. సూపర్ బంపర్ అని తెగ పొగిడేస్తుంటారు. మరీ ముఖ్యంగా కోహ్లీ కవర్ డ్రైవ్ షాట్ కొడితే దాన్ని రిపీట్స్ లో చూస్తుంటారు. దిగ్గజ సచిన్ తర్వాత టీమిండియాకు దొరికిన అద్భుతమైన బ్యాటర్ కోహ్లీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఓ విషయంలో మాత్రం కోహ్లీ ఎప్పుడూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సేమ్ సీన్ రిపీటైంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఐపీఎల్ కామెంటేటర్ సైమన్ డౌల్ ఇదే విషయాన్ని ప్రస్తవించాడు. దీంతో చాలామంది నెటిజన్స్ ఆలోచనలో పడిపోయారు.
ఇక విషయానికొస్తే.. లక్నో-బెంగళూరు జట్ల మధ్య సోమవారం రాత్రి ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. 212 పరుగుల భారీ స్కోరు చేసింది. అయినా సరే ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఛేదనలో లక్నో దుమ్మురేపింది. ఓవైపు వికెట్లు పడుతున్నా సరే టార్గెట్ ని బాదేసింది. స్టోయినిస్, పూరన్ కేక పుట్టించి బ్యాటింగ్ చేసి లక్నోని గెలిపించారు. అయితే ఆర్సీబీ ఓడిపోవడానికి అందరు కూడా బౌలర్లు కారణమని అంటున్నారు. పరుగులిచ్చేశారు, సరైన టైంలో వికెట్లు తీయాలేకపోయారని విమర్శిస్తున్నారు. ఇలాంటి టైంలో కోహ్లీ బ్యాటింగ్ గురించి చెప్పి కామెంటేటర్ సైమన్ డౌల్ షాకిచ్చాడు.
ఆర్సీబీ ఓపెనర్ కోహ్లీ.. లక్నోతో మ్యాచ్ లో 24 బంతుల్లో 42 రన్స్ కొట్టిన మంచి ఊపు మీద కనిపించాడు. 50 రన్స్ మార్క్ అందుకోవడానికి మాత్రం మరో 10 బంతులాడాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో అన్ని జట్లపై హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు. ‘ఫస్ట్ లో ధనాధన్ అని ఆడి, ఆ తర్వాత మైల్ స్టోన్ కోసం ఆడినట్లు ఉంది’ అని కామెంటేటర్ సైమన్ డౌల్ అన్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్ చూస్తే పలువురు నెటిజన్స్ కు ఇదే సందేహం వచ్చింది. ఎందుకంటే కోహ్లీ ఫాస్ట్ గా ఆడినా సరే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండేది కాదు. చేతిలో చాలానే వికెట్లు ఉన్నాయి. కోహ్లీ కాకపోతే మరో బ్యాటర్ అయినా సరే వచ్చి రన్స్ కొట్టేవాడు. కానీ ఊపు మీదున్న కోహ్లీ సడన్ గా బ్యాటింగ్ లో ఎందుకు నెమ్మదించాడు అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. కావాలనే ఇలా చేశాడు? దీని వెనక రీజన్ ఏమైనా ఉందా అనేది కోహ్లీనే చెప్పాలి. అప్పుడు గానీ క్లారిటీ రాదు. సరే ఇదంతా పక్కనబెడితే లక్నోతో మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ పై మీరేం అంటారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
Did he really say that thing about milestones though?
I heard him mention about Faf’s and Kohli’s slow batting at crucial phases, which i agree fully to, but didn’t hear a word about milestones or anything https://t.co/UoZQZviOFX
— Transponster Jay (@Jay_KD77) April 10, 2023