IPL చరిత్రలో అలాంటి ఆటగాడిని నేను ఇంత వరకు చూడలేదు అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. కానీ అతడు అండర్ రేటెడ్ ప్లేయర్ గా మిగిలిపోయాడని అన్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL ప్రపంచ క్రికెట్ చరిత్ర స్వరూపాన్ని మార్చిన టోర్నీ. ఇక ఈ టోర్నీని చూసి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20, టీ10 టోర్నీలు పుట్టగొడుల్లా పుట్టుకొచ్చాయి. అదీకాక ఈ టోర్నీ ద్వారా ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుని తమ తమ జాతీయ జట్లలో స్థానం సంపాదించుకున్నారు. అయితే ఐపీఎల్ లో రాణిస్తున్నప్పటికీ జట్టులో స్థానం సంపాదించుకోలేక పోయిన ఓ అండర్ రేటెడ్ ఆటగాడు అంటే తనకు ఇష్టం అని చెప్పుకొచ్చాడు టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ. ఐపీఎల్ చరిత్రలో అతడు గొప్ప ఆటగాడు అంటూ ప్రశంసించాడు. మరి విరాట్ కోహ్లీ మెప్పు పొందిన ఆ ఇండియన్ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఇదో పెద్ద పండగ. సమ్మర్ వచ్చిందంటే చాలు.. క్రికెట్ లవర్స్ కు జాతరే. గత 15 సీజన్లుగా వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది ఈ మెగా టోర్నీ. ప్రస్తుతం 16వ సీజన్ లో కూడా అభిమానులకు ఎక్కడాలేని మజాను అందిస్తోంది. ఇక ఐపీఎల్ లో మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు అన్న ప్రశ్నకు టీమిండియా రన్ మెషిన్ సమాధానం ఇచ్చాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్ తెలుగు తేజం అంబటి రాయుడు అంటూ చెప్పుకొచ్చాడు విరాట్.
గత కొన్ని సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న అంబటి రాయుడు.. అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అతడికి మాత్రం జాతీయ జట్టు నుంచి మాత్రం పిలుపు రాలేదు. దాంతో తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా మరిన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు విరాట్. ఐపీఎల్ లో గ్రేట్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అని, నరైన్ కంటే రషీద్ కాన్ బెటర్ స్పిన్నర్ అని, ఇక టీ20ల్లో తన ఫేవరెట్ షాట్ ఫుల్ షాట్ అని చెప్పుకొచ్చాడు. చివర్లో చెన్నైతో మ్యాచ్ ఆడటం అంటే ఎంతో ఇష్టం అని ఎందుకంటే ఆ టీమ్ కు ఎక్కువ అభిమానులు ఉన్నారని పేర్కొన్నాడు. మరి కింగ్ విరాట్ కోహ్లీ చేత అండర్ రేటెడ్ ప్లేయర్ అనిపించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Virat Kohli’s IPL picks (On JioCinema):
Most underrated batter – Ambati Rayudu.
Greatest All Rounder – Shane Watson.
Better Spinner between Narine and Rashid – Rashid.
Favorite shot in T20s – Pull shot.
Favorite team to play against – CSK due to the big fan base.— Mufaddal Vohra (@mufaddal_vohra) April 20, 2023