Virat Kohli: విరాట్ కోహ్లీ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. ఆ విషయంలో ముంబై, సీఎస్‌కే తర్వాతి స్థానం ఆర్సీబీదే అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మంచి బోణీ చేసింది. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో పటిష్టమైన ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో పాత విరాట్ కోహ్లీని తలపించాడు. ఫోర్లు, సిక్సులతో ముంబై బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. కేవలం 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. అతనికి ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సైతం మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 14.5 ఓవర్లలో 148 పరుగులు జోడించి.. విజయాన్ని ఖాయం చేశారు.
ముంబై నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే ముగించింది. ఆరంభం నుంచి కోహ్లీ-డుప్లెసిస్ జోడీ ముంబై బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగుల వరద పారించాయి. ఈ మ్యాచ్‌లో విజయం తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్, నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్టు ఆర్సీబీనే అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 8 సార్లు ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు చేరింది.
అయితే.. ఇన్ని సార్లు ప్లేఆఫ్స్‌కు చేరినా.. ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్నా.. ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేదు. ఈ విషయమై ఆర్సీబీ జట్టుపై సోషల్ మీడియా వేదికగా చాలా జోకులు కూడా పేలుతుంటాయి. అయితే ఈ సీజన్‌లో ఎలాగైనా కప్పు కొట్టడమే లక్ష్యంగా ఆర్సీబీ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. కోహ్లీ సైతం సీజన్ ఆరంభానికి ముందే ఈ సీజన్‌లో తన సత్తా చూపిస్తానని ప్రకటించాడు. అన్నట్లు గానే తొలి మ్యాచ్‌లోనే దుమ్మురేపాడు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌తో పాటు ప్లే ఆఫ్స్ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“I wanted to mention it for a while – After MI who has won 5 titles and CSK who have 4 titles, If I’m not wrong, we are the third team to have qualified the most times to the playoffs–8 times”
~Virat Kohli(RCB)#IPL #RCB pic.twitter.com/hcn0UMALGa
— Hustler (@HustlerCSK) April 2, 2023