విరాట్ కోహ్లీ శకం దాదాపుగా ముగిసిపోయినట్లే. ఇంకో మూడు నాలుగేళ్లు ఆడినా.. ఆ తర్వాత విరాట్ స్థాయి బ్యాటర్ రావడం అనేది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. కానీ విరాట్ కోహ్లీ మాత్రం పరోక్షంగా తన స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని చెప్పేసాడు.
తరాలు మారిన భారత జట్టులో బ్యాటర్లకు కొదువ లేదు. నాణ్యమైన బ్యాటర్లు భారత జట్టుకి ఎప్పుడూ వస్తూనే ఉంటారు. అయితే ఎంత మంది స్టార్ బ్యాటర్లు ఉన్నప్పటికీ.. ఒక్కో తరంలో ఒక్కో బ్యాటర్ తన సత్తా చూపిస్తూ అభిమానుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారు. 1970, 80 ల్లో సునీల్ గవాస్కర్ తిరుగు లేని బ్యాటర్ గా నిలిస్తే.. ఆ తర్వాత రెండు దశాబ్దాలు సచిన్ టెండూల్కర్ తన బ్యాటింగ్ తో రికార్డులు బద్దలు కొట్టి క్రికెట్ గాడ్ గా నిలిచాడు. ఇక గత దశాబ్ద కాలం ఉంచి విరాట్ కోహ్లీ పరుగుల ప్రవాహం గురించి మనం ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు విరాట్ కోహ్లీ తర్వాత స్టార్ ఎవరనే సందేహం ఇప్పుడు అందరిలో నెలకొంది.
విరాట్ కోహ్లీ శకం దాదాపుగా ముగిసిపోయినట్లే. ఇంకో మూడు నాలుగేళ్లు ఆడినా.. ఆ తర్వాత విరాట్ స్థాయి బ్యాటర్ రావడం అనేది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. కానీ విరాట్ కోహ్లీ మాత్రం పరోక్షంగా నా స్థానాన్ని భర్తీ చేస్తుంది శుభమన్ గిల్ అని హింట్ ఇచ్చాడు. ఐపీఎల్ లో భాగంగా నిన్న సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో గుజరాత్ జట్టు ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఇక ఈ మ్యాచులో యువ ఓపెనర్ గిల్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో పలు రికార్డులు గిల్ ఖాతాలోకి చేరాయి.
56 బంతుల్లో సెంచరీ చేసిన గిల్.. ఈ ఏడాది మూడు ఫార్మాట్ లతో పాటుగా.. ఐపీఎల్ లో కూడా సెంచరీ చేసి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో గిల్ ఇన్నింగ్స్ ని అభినందిస్తూ అందరూ ఈ అప్ కమింగ్ స్టార్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా.. టీం ఇండియా స్టార్ బ్యాటర్ అయినటువంటి కింగ్ కోహ్లీ గిల్ అట తీరుని పొగుడుతూ ఆకాశానికెత్తేసాడు. కోహ్లీ ట్వీట్ చేస్తూ “ఎక్కడ పొటెన్షియల్ ఉంటుందో అక్కడ గిల్ ఉంటాడు. నెక్స్ట్ జెనరేషన్ ని నువ్వే నడిపించాలి. గాడ్ బ్లెస్స్ యు” అని కోహ్లీ తెలియజేశాడు. మరి తన తర్వాత..గిల్ గ్రేట్ బ్యాటర్ అని కోహ్లీ చెప్పకనే చెప్పాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.