ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతం చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ సూపర్బ్ విక్టరీ కొట్టింది. అయితే మ్యాచ్ నెగ్గిన తర్వాత విరాట్ కోహ్లీ కాస్త అతి చేశాడు.
ప్లేఆఫ్స్ ఆశలు అడుగంటుతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతం చేసింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 112 రన్స్ తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ (18) ఫర్వాలేదనిపించినా.. ఆర్సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ (55), హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (54) అద్భుతంగా ఆడారు. చివర్లో అనూజ్ రావత్ (29) మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. రాజస్థాన్ బౌలర్లలో ఆడమ్ జంపా, కేఎం ఆసిఫ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 59 రన్స్‌కే కుప్పకూలింది. ఏ దశలోనూ రాజస్థాన్ బ్యాటింగ్ కుదురుకోలేదు. ఆ జట్టు బ్యాటర్లలో షిమ్రన్ హెట్మెయిర్ (35) ఒక్కడే రాణించాడు.
ఆర్సీబీ పేసర్లు వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ ఓపెనర్లను వెనక్కి పంపారు. ఆ తర్వాత స్పిన్నర్లు బ్రేస్‌వెల్, కర్ణ్‌శర్మ చెరో రెండు వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించారు. మ్యాక్స్‌వెల్ కీలకమైన హెట్మెయిర్ వికెట్‌ను పడగొట్టాడు. ఇలా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సమష్టిగా రాణించిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలను కాపాడుకుంది. అయితే మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. గెలిచిన సంబురంలో కాస్త అతి చేశాడు విరాట్. తాను గనుక బౌలింగ్ చేసుంటే రాజస్థాన్ 40 రన్స్‌కే ఆలౌట్ అయ్యేదంటూ కామెంట్స్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కొత్తగా వచ్చిన ఇద్దరు బౌలర్లు (పార్నెల్, కర్ణ్‌శర్మ) చెలరేగడంతో ఆర్సీబీ మ్యాచ్ గెలిచేసింది. దీనికి కోహ్లీ ఇంతగా రెచ్చిపోవాలా అని అంటున్నారు. మున్ముందు ప్లేఆఫ్స్ ఉన్నాయి కదా ఆర్సీబీ అప్పుడేం చేస్తుందో చూద్దామని కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
A post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore)