టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన ఆటతో సచిన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అంతేకాక సచిన్ ను మైమరిపించేలా కోహ్లి బ్యాటింగ్ చేస్తూ భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు. అలానే ఎన్నో రికార్డులు తన పేరిట నమోదు చేశాడు. తాజాగా మరో అరుదైన ఘనత కింగ్ కోహ్లి సాధించాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన ఆటతో సచిన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అంతేకాక సచిన్ ను మైమరిపించేలా కోహ్లి బ్యాటింగ్ చేస్తూ భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు. విలక్షణమైన బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తూ ఎన్నో రికార్డులు తన పేరిట నమోదు చేశాడు. అలానే తన రికార్డుల వేటను ఐపీఎల్ లో కూడా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ క్రికెట్ లో కూడ పలు రికార్డు సొంతం చేసుకున్నా కింగ్ కోహ్లి.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20 చరిత్రలో ఒకే స్టేడియం వేదికగా మూడు వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా కోహ్లి రికార్డుకెక్కాడు.
ఐపీఎల్ సీజన్ 16లో భాగం బుధవారం కలకత్తా, బెంగళూరు మధ్య చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో బెంగుళూరు ఓడిపోయింది. కేకేఆర్ ఇచ్చిన భారీ టార్గెట్ ను చేధించే క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 54 పరుగులు చేసి ఆశలు రేపారు. అయితే కేకేఆర్ ఆటగాళ్లు కీలక సమయంలో బౌలింగ్, ఫీల్డింగ్‌తో అదరగొట్టి ఆర్సీబీని ఓడించారు. అలానే డుప్లెసిస్ 7 బంతుల్లో 17 పరుగులు, మాక్స్‌వెల్ 5 పరుగుల తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ జట్టు కష్టాల్లో పడింది.
ఇక కింగ్ కోహ్లీ ఒత్తిడిలో బాగా రాణించాడు. అయినప్పటికి సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఈ సీజన్‌లో కేకేఆర్ చేతిలో ఆర్సీబీకి ఇది రెండో ఓటమి కావడం గమనార్హం. గట్టి ప్రత్యర్థిగా భావించే కలకత్తా చేతిలో రెండోసారి ఓడిపోవడం బెంగళూరు అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. అయితే ఈ మ్యాచ్ లో కింగ్ ఓ అరుదైన ఫీట్ సాధించాడు. టీ20 చరిత్రలో ఒకే స్టేడియం వేదికగా 3 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా కోహ్లి రికార్డుకెక్కాడు. ఆర్‌సీబీకి హోంగ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి మూడువేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
అలానే మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ ఘనత ఏంటంటే.. ఐపీఎల్‌లో కేకేఆర్‌పై అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. కలకత్తపై ఇప్పటివరకు కోహ్లి 858 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 1075, రోహిత్ 1040 పరుగులతో తొలి రెండో స్థానంలో ఉన్నారు. 858 పరుగులతో కోహ్లి మూడో స్థానంలో ఆతరువాత 850 పరుగులతో శిఖర్ ధావన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. మరి.. కోహ్లి సాధించిన ఈ అరుదైన ఘనతలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.