Virat Kohli: ఆర్సీబీ సొంత మైదానంలో కేకేఆర్ ఘన విజయం సాధించింది. కోహ్లీ ఫిఫ్టీతో రాణించినా.. కేకేఆర్ బౌలింగ్ ముందు ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ నిలువలేకపోయింది. ఈ ఓటమిపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2023లో భాగంగా బుధవారం కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరంభంలో కేకేఆర్ ఓపెనర్ జెసన్ రాయ్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా షాబాజ్ అహ్మాద్ వేసిన ఓవర్‌లో నాలుగు సిక్సులు, ఒక ఫోర్‌తో విధ్వంసం సృష్టించాడు. మరో ఎండ్‌లో జగదీశణ్ స్లోగా బ్యాటింగ్ చేస్తున్నా.. రాయ్ చెలరేగి ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించిన తర్వాత.. యువ బౌలర్ విజయ్ కుమార్ జగదీశణ్‌ను అవుట్ చేసి.. పార్ట్నర్‌షిప్‌ను దెబ్బతీశాడు.
ఆ వెంటనే రాయ్ కూడా అవుట్ అవ్వడంతో కేకేఆర్ స్పీడ్‌కు బ్రేక్ పడింది. కానీ, చివర్లో కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా, రింకూ సింగ్ మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ భారీ స్కోర్ సాధించింది. ఈ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ వేగంగా ఆడారు. దీంతో తొలి రెండు ఓవర్లలోనే ఆర్సీబీ 30 పరుగులపైనే స్కోర్ చేసింది. కానీ, నితీష్ రాణా తెలివిగా ఆలోచించి.. వెంటనే స్పిన్నర్లను రంగంలోకి దింపి ఆర్సీబీని దెబ్బతీశాడు. యువ బౌలర్ సుయాష్ శర్మ రాగానే భారీ షాట్లతో విరుచుకుపడుతున్న డుప్లెసిస్‌ను అవుట్ చేశాడు. 7 బంతుల్లో 17 పరుగులు చేసిన ఫాఫ్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే షాబాజ్, మ్యాక్స్‌వెల్ అవుట్ అవ్వడంతో ఆర్సీబీ కోలుకోలేకపోయింది. కోహ్లీ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా.. గెలిపించలేకపోయాడు. ఫిఫ్టీ తర్వాత వేగంగా ఆడే ప్రయత్నంలో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.
మొత్తం మీద 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి 21 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ ఓటమి తర్వాత.. మాట్లాడిన విరాట్ కోహ్లీ తమ చెత్త ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ చెత్త ఆటతో కేకేఆర్‌ను మేమే గెలిపించామని అన్నాడు. బౌలింగ్‌లో రాణించినప్పటికీ.. సులువైన క్యాచ్‌లు వదిలేసి మ్యాచ్‌నే పొగొట్టుకున్నామని అన్నాడు. అలాగే బ్యాటింగ్‌లో పోరాటం చేసినా.. చెత్త బంతులకు సైతం మరింత చెత్త షాట్లు ఆడి క్యాచ్‌లు ఇచ్చామని అందుకే ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనట్లు కోహ్లీ పేర్కొన్నాడు. మరి ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ప్రదర్శనతో పాటు కోహ్లీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli said, “we deserved to lose tonight, we weren’t professional tonight in the field”. pic.twitter.com/hxPqjLl0Cd
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2023