Virat Kohli: ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ భారీ షాకిచ్చింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన బాధలో ఉన్న కోహ్లీకి ఇది దెబ్బ మీద దెబ్బలా మారింది.
ఐపీఎల్ 2023లో భాగంగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఫుల్ వినోదాన్ని అందించింది. ఇరు జట్ల బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఫోర్లు, సిక్సుల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో అంతిమంగా ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ స్కోర్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ విజయానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
అయితే.. ఇంత భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఓపెనర్ విరాట్ కోహ్లీ 4 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్ అవ్వడం ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బలా మారింది. అయితే.. కోహ్లీ దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. చెన్నై బౌలర్ ఆకాష్ సింగ్ వేసిన మొదటి ఓవర్లో ఒక బౌండరీ బాదిన కోహ్లీ.. ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. బాల్ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని అతని కాలికి తాకింది. కాలికి తగిలిన బంతి వెనక్కు వెళ్లిపోతుందని అనుకున్న కోహ్లీ వెనక్కు తిరిగి చూశాడు. అప్పటికి ఇంకా బంతి వెనక్కు వెళ్లలేదు. కోహ్లీ వెనక్కి తిరిగే క్రమంలో బాల్‌కు అతని కాలు తగిలింది. దీంతో బాల్ వెళ్లి వికెట్లకు తగిలింది. ఇంత బ్యాడ్‌లక్‌గా కోహ్లీ అవుట్ అయ్యాడు.
కోహ్లీ అవుటైనా కూడా ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ అద్భుతంగా ఆడటంతో ఆర్సీబీ గెలిచేలా కనిపించింది. కానీ, ధోని మాస్టర్ మైండ్, చెన్నై బౌలింగ్ ముందు ఆర్సీబీ నిలువలేకపోయింది. చివరికి 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇలా మ్యాచ్ ఓటమితో పాటు, దురదృష్టవశాత్తు అవుటై బాధలో ఉన్న కోహ్లీకి.. బీసీసీఐ మరో షాకిచ్చింది. అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. చెన్నై బ్యాటర్ శివమ్ దూబే అవుటైన సమయంలో కోహ్లీ అతిగా సెలబ్రేట్ చేసుకోవడంతో మ్యాచ్ రిఫరీ కోహ్లీకి జరిమానా విధించాడు. ఐపీఎల్ కోడ్‌ను ఉల్లంఘిచినట్లు కోహ్లీ సైతం ఒప్పుకోవడం గమనార్హం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli has been fined 10% of match fees for breaching IPL code of conduct.
— Johns. (@CricCrazyJohns) April 17, 2023