స్టార్ క్రికెటర్లంటే అభిమానం ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది డై హార్డ్ ఫ్యాన్స్ తమ ఫ్యాన్ ని ఎలాగైనా కలవాలని ఉద్దేశ్యంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తారు.అలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి చోటు చేసుకుంది. కోహ్లీ వీరాభిమాని గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. అయితే ఆ అభిమాని ఏం చేసాడంటే?
స్టార్ క్రికెటర్లంటే అభిమానం ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. మాములుగా అయితే వీరిని చూసే అవకాశం వస్తుంది కానీ వీరిని కలిసే అవకాశం దాదాపుగా అభిమానులకి ఉండదు. అయితే కొంతమంది డై హార్డ్ ఫ్యాన్స్ తమ ఫ్యాన్ ని ఎలాగైనా కలవాలని ఉద్దేశ్యంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ముందు వెనక చూసుకోకుండా ఏమి ఆలోచించకుండా తమకి ఇష్టమైన క్రికెటర్ ని చూసి తమ కళను నెరవేర్చుకుంటారు. ఇలాంటి సందర్భాలు క్రికెట్ లో మనం చాలానే చూసాం. అలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి చోటు చేసుకుంది. కోహ్లీ వీరాభిమాని గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. అయితే ఆ అభిమాని ఏం చేసాడంటే?
ఐపీఎల్ లో భాగంగా నిన్న లక్నో, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. లో స్కోరింగ్ మ్యాచులో ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. ఈ సంగతి అలా ఉంచితే.. నిన్న జరిగిన ఈ మ్యాచులో కోహ్లీ అభిమాని హల్ చల్ చేసాడు. ఫుల్ సెక్యూరిటీ ఉన్న గ్రౌండ్ లో ఆశ్చర్యకరంగా అందరిని మైమరిపించి గ్రౌండ్ లో దర్శనమిచ్చాడు. ఇక గ్రౌండ్ లో మోకాలి మీద నించొని కోహ్లీకి నమస్కరించాడు. ఇది చూసిన కోహ్లీ అభిమానిని పైకి లేపి జాగ్రతగా బయటకు పంపించాడు. చాలా మంది అభిమానులు అభిమానుల కాళ్ళు పట్టుకోవడం , ఫోటో దిగడం లాంటివి చేస్తుంటారు. కానీ ఈ ఫ్యాన్ మాత్రం కాస్త స్పెషల్ గా కోహ్లీ మీద అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
This is what Virat Kohli has earned, a fan entered touched Kohli’s feet.
The Icon, Inspiration, The GOAT. ❤️ pic.twitter.com/J6Os7OuKPt
— Sexy Cricket Shots (@sexycricketshot) May 2, 2023