విరాట్ కోహ్లీ టీ20ల్లో చరిత్ర సృష్టించాడు. అది కూడా ఆర్సీబీ తరఫున అద్భుతమైన ఘనత సాధించాడు. ప్రస్తుతం ఇది క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్. ఇంతకీ ఏంటి సంగతి?
ఆర్సీబీ అంటే కోహ్లీ.. కోహ్లీ అంటే ఆర్సీబీ. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇదే జట్టుకు ఆడుతున్న విరాట్.. టీ20 క్రికెట్ లో పరుగుల వరద పారించాడు. లెక్కలేనన్ని రికార్డులు సృష్టించాడు. ఇప్పటికీ సరికొత్త రికార్డులని సొంతం చేసుకుంటూనే ఉన్నాడు. ఆర్సీబీకి రానిది ఏమైనా ఉందంటే.. అది ఒక్క కప్పు మాత్రమే. సరే ఇప్పుడు ఆ గోల ఎందుకులే గానీ.. తాజాగా రాజస్థాన్ మ్యాచ్ తో బరిలోకి దిగిన కోహ్లీ.. టీ20 క్రికెట్ లో ఏ ఆటగాడికి సాధ్యం కానీ అరుదైన, అద్భుతమైన రికార్డుని క్రియేట్ చేశాడు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో హైలెట్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
అసలు విషయానికొచ్చేస్తే.. ఒకప్పుడు ఆయా దేశాల క్రికెటర్లు జాతీయ జట్టు తరఫున వందలాది మ్యాచులు ఆడేవారు. కానీ టీ20 లీగులు ఎంట్రీతో మొత్తం సీన్ మారిపోయింది. ఐపీఎల్, బిగ్ బాష్, సీపీఎల్, బీపీఎల్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లీగ్స్ పుట్టుకొచ్చాయి. వాటిలో ఆడుతూ స్టార్ క్రికెటర్లు బిజీగా ఉంటున్నారు. అయితే ఐపీఎల్ కోహ్లీ మాత్రం ఈ టోర్నీ మొదలైన దగ్గర నుంచి అంటే 2008 నుంచి ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మాత్రమే ఆడాడు, స్టిల్ ఇప్పటికీ ఆడుతున్నాడు. అలా ఇప్పుడు ఓ అరుదైన రికార్డుని నెలకొల్పాడు.
ఐపీఎల్ లో ఇప్పటివరకు 235 మ్యాచులాడిన కోహ్లీ.. గతంలో అన్ని దేశాల ఐపీఎల్ జట్లతో జరిగిన ఛాంపియన్స్ లీగ్ లో మరో 15 మ్యాచ్ లాడాడు. ఓవరాల్ గా ఒక్క ఫ్రాంచైజీ తరఫున టీ20ల్లో 250 మ్యాచులాడిన వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ గా నిలిచాడు. ఇదిలాఉండగా తాజాగా రాజస్థాన్ మ్యాచ్ లో నిరాశపరిచిన కోహ్లీ.. 19 బంతులాడి కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ మొత్తం దాదాపు ఇలానే కాస్త నెమ్మదిగానే ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ హాఫ్ సెంచరీలు చేస్తున్నప్పటికీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే టీ20ల్లో కోహ్లీ చరిత్ర సృష్టించడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.