Virat Kohli: కోహ్లీ.. ఇప్పటికే అనేక రికార్డులను బద్దలుకొట్టిన క్రికెటర్. ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్. తాజాగా ఐపీఎల్‌లో మరో అదురైన రికార్డును సాధించాడు..
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు మిస్టర్ ఐపీఎల్‌గా పేరుంది. అలాగే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు అత్యధికంగా ఐదుసార్లు కప్పు అందించాడు. అలాగే ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. దీంతో ఐపీఎల్‌లో రైనా, రోహిత్, ధోని స్టార్ ప్లేయర్లుగా పేరుతెచ్చుకున్నారు. అయితే ఒక రికార్డు విషయంలో మాత్రం ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. గురువారం కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 18 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. అంతకు ముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన కోహ్లీ.. 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 82 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు.
అయితే.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 21 పరుగులకే అవుటైనా.. కోహ్లీ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బెంగుళూరులో కాకుండా హోం అవే గ్రౌండ్స్(బెంగుళూరులో కాకుండా ఇతర వేదికలు)లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. హోం అవే గ్రౌండ్స్‌లో 3 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2008 ఆరంభ సీజన్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న కోహ్లీ.. ఇప్పటి వరకు ఒక్క సీజన్ కూడా మిస్ అవ్వలేదు. ఇప్పటి వరకు 225 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 217 ఇన్నింగ్స్‌ల్లో 129.46 స్ట్రైక్‌రేట్‌తో 6,727 పరుగులు చేశాడు. వాటిలో 3000 పరుగులు హోం అవే గ్రౌండ్స్‌లోనే కొట్టాడు. ఐపీఎల్‌లో కోహ్లీకి 5 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 587 ఫోర్లు, 223 సిక్సులు బాదాడు. మరి ఐపీఎల్‌లో హోం అవే గ్రౌండ్స్‌లో ఆడి కోహ్లీ 3 వేల పరుగులు పూర్తి చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli becomes the first batsman to complete 3000 runs in away matches in IPL history.
— Johns. (@CricCrazyJohns) April 7, 2023