విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి ఎవరికీ ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతనికి పరుగుల యంత్రం అనే పేరు ఊరికే రాలేదు. ఇప్పటికే కోహ్లీ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఆ లిస్టులోకి ఇప్పుడు ఒక అరుదైన రికార్డు వచ్చి చేరింది.
విరాట్ కోహ్లీ.. ఇండియన్ క్రికెట్ లో కింగ్ అనే బిరుదు సొంతం చేసుకున్నాడు. పరుగుల యంత్రం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విరాట్ కోహ్లీ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. మరెన్నో రికార్డులను బద్దలు కొట్టిన హిస్టరీ ఉంది. అయితే తాజాగా మరో మైలు రాయి కోహ్లీ ఖాతాలో చేరింది. ఈసారి దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఆ రికార్డు ఇప్పుడల్లా మరే ప్లేయర్ బ్రేక్ చేసే ఛాన్స్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ రికార్డు దరిదాపుల్లో కూడా ఇంకో ప్లేయర్ లేడని చెబుతున్నారు. అయితే ఆ రికార్డు ఎందుకంత స్పెషల్? అసలు కోహ్లీ సాధించిన ఆ అరుదైన ఫీట్ ఏంటో చూద్దాం.
ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్ సీజన్లో ఇంకా సరైన స్టార్ట్ అందుకోలేదు. కానీ, విరాట్ కోహ్లీ మాత్రం తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో టీమ్ ని విజయ తీరాలు చేర్చేందుకు ఎంతో కృషి చేస్తున్నాడు. తాజాగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ 147.06 స్ట్రైక్ రేట్ తో కేవలం 34 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 50 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఓ రికార్డును కూడా క్రియేట్ చేశాడు. అదేంటంటే.. ఒక వేదికలో 2,500 పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్ గా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డను సృష్టించాడు.
Third 5⃣0⃣ in a row this season at the Chinnaswamy stadium!
Virat in RED hot form 🥵#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #RCBvDC pic.twitter.com/dydEDhpSBG
— Royal Challengers Bangalore (@RCBTweets) April 15, 2023
నిజానికి దీనిని బద్దలు కొట్టడం ఏ బ్యాటర్ కి అయినా అంత తేలిక కాదని చెబుతున్నారు. ఎందుకంటే ఒకే వెన్యూ ఇప్పటి వరకు కనీసం 2 వేల పరుగులు చేసిన వాళ్లు కూడా లేరు. కానీ, విరాట్ కోహ్లీ మాత్రం ఏకంగా చిన్నస్వామి స్టేడియంలో 2,500 పరుగులు పూర్తి చేశాడు. ఇంక ఆర్సీబీ- డీసీ మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ అర్ధ శతకం పూర్తి చేయగా.. డుప్లెసిస్ మాత్రం కేవలం 22 పరుగులకే పెవిలియన్ చేరాడు. మహిపాల్ కూడా 26 పరుగులు చేసిన ఔటయ్యాడు. మ్యాచ్ ఫలితాన్ని పక్కన పెడితే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. విరాట్ సాధించిన ఈ ఫీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Virat Kohli becomes the first ever batter to complete 2,500 runs at a venue in the IPL – Chinnaswamy Stadium.
No other has scored even 2,000 runs at a single venue! pic.twitter.com/4Bpz79zfGN
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2023