Virat Kohli, Sourav Ganguly: టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చేస్తే.. దాదాకు మంచి ట్రిబ్యూట్ ఇచ్చినట్లు
ఐపీఎల్ 2023లో ఆర్సీబీ మ్యాచ్ అంటేనే క్రికెట్ అభిమానుల్లో ఏదో తెలియని టెన్షన్ కనిపిస్తోంది. ఎప్పుడు ఏం అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఆర్సీబీ-ఢిల్లీ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీకి కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, కోపంగా చూడ్డాం లాంటి ఘటనలపై ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అలాగే లక్నో-ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ కోహ్లీ-నవీన్ ఉల్ హక్, కోహ్లీ-గంభీర్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి ఆర్సీబీ-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతుండటంతో ఒక్కసారిగా ఐపీఎల్ వాతావరణం హీటెక్కింది.
తొలి మ్యాచ్‌లో కోహ్లీ-గంగూలీ మధ్య జరిగిన ఘటన నేపథ్యంలో మరోసారి ఈ రెండు జట్లు తలపడుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. మరోసారి కోహ్లీ-గంగూలీ ఎదురుపడితే.. పలకరించుకుంటారా? లేదా అనే విషయం గురించి క్రికెట్ ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. తన కెప్టెన్సీ పోడానికి గంగూలీనే కారణం అని కోహ్లీలో బలంగా ద్వేషం నాటుకుపోయిందని, కోహ్లీ మళ్లీ గంగూలీతో నార్మల్‌గా మాట్లాడే పరిస్థితి లేదని చాలా మంది క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరి వీరిద్దరూ నేటి మ్యాచ్‌లో ఎదురు పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఇప్పటికే ఈ విషయంపై ఆందోళన నెలకొని ఉంటే.. టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చేస్తే.. దాదాకు మంచి ట్రిబ్యూట్ ఇచ్చినట్లు అవుతుందని కాస్త వ్యంగ్యంగా స్పందించాడు. అంటే.. ఢిల్లీపై సెంచరీ కొడితే.. గంగూలీకి తగిన బుద్ధి చెప్పినట్లు ఉంటుందని శ్రీశాంత్ ఉద్దేశమా? అంటూ క్రికెట్ అభిమానులు శ్రీశాంత్‌పై మండిపడుతున్నారు. ఇలాంటి చెత్త వ్యాఖ్యలపై ఆటగాళ్ల మధ్య మంటలు పెట్టడం బదులు కాస్త మంచిగా ఆలోచిస్తే.. బెటర్ అంటూ హితవు పలుకుతున్నారు. మరి కోహ్లీ-గంగూలీ విషయంలో శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
S Sreesanth said,🗣️ “Virat Kohli scoring a century against Delhi Capitals will be a great tribute to Dada”. 😶🌫️#ViratKohli #SouravGanguly #IPL #DCvRCB pic.twitter.com/GxHudzmiW5
— CricWatcher (@CricWatcher11) May 6, 2023