రన్ మెషిన్ 'విరాట్ కోహ్లీ' మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన కోహ్లీ టోర్నీ చరిత్రలో 7 వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.
టీమిండియా మాజీ సారథి, రన్ మెషిన్ ‘విరాట్ కోహ్లీ‘ మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన కోహ్లీ టోర్నీ చరిత్రలో 7 వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 12 పరుగుల వద్ద కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌కి ముందు 6988 పరుగులతో ఉన్న కోహ్లీ తొలి రెండు ఓవర్లలోనే ఈ రికార్డ్‌ను చేరుకున్నాడు. కోహ్లి 233 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్ 2023 సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కరు. ఆరంజ్ క్యాప్ రేసులో డుప్లెసిస్(467), డెవాన్ కాన్వే(458), యశస్వి జైశ్వాల్(442), రుతురాజ్ గైక్వాడ్(384) తొలి నాలుగు స్థానాల్లో ఉండగా కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 376 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఇక ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ(7053) అగ్రస్థానంలో ఉండగా, శిఖర్ ధావన్ (6536), డేవిడ్ వార్నర్ (6189), రోహిత్ శర్మ (6063), సురేశ్ రైనా (5528) ఆ తరువాత స్థానాల్లో ఉన్నారు. అలాగే గత 16 సీజన్లుగా ఒకే జట్టుకు అన్ని సీజన్లూ ఆడిన ఏకైక ప్లేయర్ కోహ్లీనే కావడం గమనార్హం. కోహ్లీ టోర్నీ(2008) ప్రారంభమైన నాటి నుంచి బెంగళూరు జట్టుకే ఆడుతున్నాడు.
IPL’s poster on Virat Kohli’s 7000 runs in IPL.
The Man, The Myth, The Legend, The GOAT – King Kohli. pic.twitter.com/wCkP8oAopo
— CricketMAN2 (@ImTanujSingh) May 6, 2023
Virat Kohli in IPL 2023:
– 82*(49) vs MI
– 21(18) vs KKR
– 61(44) vs LSG
– 50(34) vs DC
– 6(4) vs CSK
– 59(47) vs PBKS
– 0(1) vs RR
– 54(37) vs KKR
– 31(30) vs LSG
– 55(46) vs DC6th fifty from 10 innings – most by any batter – King of world cricket. pic.twitter.com/AlWedK5bfG
— Johns. (@CricCrazyJohns) May 6, 2023