ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న సిరాజ్.. ఇటీవలే ఫిల్మ్ నగర్ లో ఒక కొత్త ఇంటిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్సీబీ ఆటగాళ్లందరిని తన ఇంటికి ఆహ్వానించగా.. ఇక్కడే సిరాజ్ కోహ్లీకి ఎంత పెద్ద అభిమానో తెలిసింది.
గ్రౌండ్ లో మహమ్మద్ సిరాజ్ ఎంత అగ్రెస్సివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాటకు మాట సమాధాం చెబుతూ ఎక్కడా తగ్గేలా అస్సలు కనిపించడు. దూకుడే నైజంగా సిరాజ్ క్రికెట్ లో కసిగా ఎదిగిన తీరు అద్భుతం. ఈ క్రమంలో వన్డేల్లో నెంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో తన బౌలింగ్ తో హడలెత్తిస్తున్నాడు. అయితే ఈ అగ్రెస్సివ్ నెస్.. విరాట్ కోహ్లీ నుంచే వచ్చిందనే విషయం మనకు తెలిసిందే. కోహ్లీ తనకు స్ఫూర్తి అనే విషయం ఎన్నోసార్లు చెప్పాడు. అయితే కోహ్లీ అంటే సిరాజ్ కి ఇంతలా అభిమానం ఉందని ఎవ్వరూ ఊహించి ఉండరు.
ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న సిరాజ్.. ఇటీవలే ఫిల్మ్ నగర్ లో ఒక కొత్త ఇంటిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. అయితే రేపు సన్ రైజర్స్ తో మ్యాచ్ సందర్భంగా ప్రస్తుతం ఆర్సీబీ హైదరాబాద్ లో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు రెండు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చి ప్రాక్టీస్ మొదలెట్టేసాడు. ఇక ఇదే మంచి సమయమని భావించిన సిరాజ్ కెప్టెన్ డుప్లెసిస్, కోహ్లీతో సహా.. ఆర్సీబీ ఆటగాళ్లందరిని తన ఇంటికి ఆహ్వానించాడు. ఇంటికి వచ్చిన ఆర్సీబీ ఆటగాళ్లు కాసేపు సందడి చేస్తూ కనిపించారు. అయితే ఇక్కడే సిరాజ్ కోహ్లీకి ఎంత పెద్ద అభిమానో తెలిసింది.
కోహ్లీ సిరాజ్ తో ఉన్న ఒక ఫోటోని పెద్ద ఫ్రేమ్ కట్టించి ఇంటి గోడకు వేలాడదీసిన ఫోటో ఒకటి ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతే కాదు కోహ్లీ ఇచ్చిన బ్యాట్ ని కూడా చాలా భద్రంగా దాచుకోవడం విశేషం. దీంతో సిరాజ్ కోహ్లీని ఎంతలా ఆరాధిస్తున్నాడో అర్ధం అవుతుంది. దీంతో ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరి మధ్య బాండ్ చాలా స్పెషల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సిరాజ్ ప్రస్తుత సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. తనదైన శైలిలో పవర్ ప్లే లో వికెట్లు తీస్తూ ఆర్సీబీకి శుభారంభం అందిస్తున్నాడు. మొత్తానికి సిరాజ్.. కోహ్లీ మీద చూపించిన అభిమానం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.