రికార్డులు అనేవి క్రికెట్ లో సహజమే అయినా.. కొన్ని రికార్డులు మాత్రం ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. సాధారణంగా రికార్డులు సృష్టించడం, వాటిని బద్దలు కొట్టడం లాంటివే మనం చూస్తూ ఉంటాం. కానీ తాజాగా.. నిన్న ఐపీఎల్ లో ఒక ఇంట్రెస్టింగ్ రికార్డ్ ఒకటి చోటు చేసుకుంది.
ఐపీఎల్ 2023 రికార్డులకు కేరాఫ్ గా మారింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లాంటి విషయాల్లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. రోజుకొక రికార్డుతో సంచలనంగా మారుతుంది. రికార్డులు అనేవి క్రికెట్ లో సహజమే అయినా.. కొన్ని రికార్డులు మాత్రం ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. సాధారణంగా రికార్డులు సృష్టించడం, వాటిని బద్దలు కొట్టడం లాంటివే మనం చూస్తూ ఉంటాం. కానీ తాజాగా.. నిన్న ఐపీఎల్ లో ఒక ఇంట్రెస్టింగ్ రికార్డ్ ఒకటి చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచులో ఈ రికార్డ్ 15 ఏళ్ల ఐపీఎల్ లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరి ఆ రికార్డ్ ఏంటి ?
ఐపీఎల్ లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటలిస్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో ధోని సేన 27 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టుపై విజయం సాధించింది. చెన్నై విధించిన 167 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు చేధించలేక చతికిలపడింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 140 పరుగులకే పరిమితమైంది. ఇక ఈ మ్యాచు గెలవడం ద్వారా ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ నుంచి దాదాపు నిష్క్రమించగా, చెన్నై ప్లే ఆఫ్ కి దగ్గరలో ఉంది.
మొదట బ్యాటింగ్ చేసిన జట్టు స్కోర్ 167. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన స్కోర్ 140. ఎక్కువగా సిక్సులు, ఫోర్లు లేవు. అలాగని బౌలర్లు విజ్రంభించే స్పెల్ కూడా వేయలేదు. ఇక ఫీల్డింగ్ లో లలిత్ యాదవ్ క్యాచ్ మినహా పెద్దగా మిరాకిల్స్ జరగలేదు. ఒక నార్మల్ మ్యాచ్ జరిగినట్లుగా అనిపించింది. కానీ ఔరా అనే రికార్డ్ ఒకటి చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఇరు జట్లు 20 ఓవర్లు ఆడినా గాని గెలిచిన జట్టులో ఒక్కరు కూడా 25 కి పైగా పరుగులు చేయడం గమనార్హం. ఈ మ్యాచులో చెన్నై టీం 167 పరుగులు చేసినా.. ఆ జట్టులో అత్యధిక స్కోర్ 25 మాత్రమే కావడం విశేషం. ఇలా ఒక మ్యాచ్ పూర్తిగా జరిగి కూడా గెలిచిన జట్టులో ఒక్కరు కూడా 25 పైగా స్కోర్ కొట్టకపోవాదం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. మరి ఈ రికార్డ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.