వాంఖడే వేదికగా ముంబై- కోల్‌కతామధ్య జరిగిన మ్యాచ్.. సిక్సులు, ఫోర్లు, గొడవలు అన్నట్లుగా సాగింది. కేకేఆర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ సెంచరీతో మెరవగా, ముంబై యువ క్రికెటర్ హ్రితిక్ షోకీన్ ఓ చిలిపి పని చేసి చీవాట్లు తిన్నాడు.
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోర్ చేసింది. వరుసగా వికెట్లు కోల్పోయినా కేకేఆర్ భారీ స్కోర్ చేయడం గమనార్హం. కేకేఆర్ యువ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఒంటరి పోరాటం చేశాడు. 49 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్న అయ్యర్.. మొత్తంగా 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. అతని ధాటికి కేకేఆర్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఏమాత్రం శుభారంభం లభించలేదు. జగదీషన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆపై క్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్ నుంచి సహకారం లేకపోయినా ఫోర్లు, సిక్సులు బాదుతూ ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో 49 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్న అయ్యర్.. మొత్తంగా 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇది రెండో సెంచరీ కాగా, కేకేఆర్ బ్యాటర్ 15 ఏళ్ల తర్వాత సెంచరీ చేయడం గమనార్హం. కేకేఆర్ బ్యాటర్‌గా 2008 ఐపీఎల్ సీజన్ లో బ్రెండన్ మెక్‌కలమ్ మొదటి సెంచరీ చేశాడు. ఆపై కేకేఆర్ బ్యాటర్ల నుండి ఇది రెండోది.
💯 for @venkateshiyer! 👏 👏
This has been a stunning knock ⚡️ ⚡️
He has overcome an injury to notch up his maiden IPL TON! 💪 💪
Follow the match ▶️ https://t.co/CcXVDhfzmi#TATAIPL | #MIvKKR | @KKRiders pic.twitter.com/BiNC0gDDbJ
— IndianPremierLeague (@IPL) April 16, 2023
కాగా, ఈ మ్యాచ్ అమాంతం హోరీహోరీగా సాగింది. సిక్సులు, ఫోర్లు, గొడవలు అన్నట్లుగా సాగింది. ముంబై యువ క్రికెటర్ హ్రితిక్ షోకీన్ చేసిన ఓ చిలిపి పని కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణాకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో రాణా కోపంగా అతని వైపు రాగా ముంబయి సారథి సూర్యకుమార్ యాదవ్ కలుగజేసుకొని సముదాయించి పంపించాడు. ఇక ఈ మ్యాచ్ లో సచిన్ తనయుడు అరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. రెండు ఓవర్లు మాత్రమే వేసిన అర్జున్ టెండూల్కర్ 17 పరుగులిచ్చాడు. ముంబై బౌలర్లలో హ్రితిక్ షోకీన్ పడగొట్టగా మిగిలిన వారు పర్వాలేదనిపించారు.
Aggressive Nitish Rana !pic.twitter.com/a6AvPGm0xG
— 🎰 (@StanMSD) April 16, 2023