విరాట్ కోహ్లీ- గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవను ఆధారంగా చేసుకొని, ఓ అనామక కోడర్ వీరిద్దరిపై వీడియో గేమ్‌ను రూపొందించాడు. ఈ గేమ్‌లో కోహ్లీ ఓటమిపాలవ్వడం గమనార్హం.
లక్నో వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్ మ్యాచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మ్యాచులో ఆర్‌సీబీ చేసింది 126 పరుగులే అయిన దాన్ని కాపాడుకోవడంలో ఆ జట్టు ఆటగాళ్లు చేసిన పోరాటం అద్బుతమనే చెప్పాలి. పటిష్టమైన లక్నో జట్టును వారి సొంతగడ్డపైనే 18 పరుగుల తేడాతో మట్టి కరిపించడమన్నది మాములు విషయం కాదు. ముఖ్యంగా భారత మాజీ సారధి విరాట్ కోహ్లీ, తన అగ్రెసివ్ నెస్‌తో లక్నో ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టి, ఫలితాన్ని రాబట్టాడు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సజావుగానే ముగిసినా, లక్నో ఇన్నింగ్స్ మాత్రం గొడవలతోనే ముందుకు సాగింది.
విరాట్ కోహ్లీకి, మహమ్మద్ సిరాజ్ కూడా చేయి కలపడంతో ఒకానొక సమయంలో ఈ ఘటనలు పెద్ద గొడవకు దారితీసేలా కనిపించాయి. మ్యాచ్ ముగిశాక అదే జరిగింది. మైదానంలో కోహ్లీ ప్రవర్తనా శైలి నచ్చని గౌతం గంభీర్ అతనితో కయ్యానికి కాలు దువ్వాడు. ఒకానొక సమయంలో అతనిపైకి దూసుకెళ్లాడు. నవీన్ ఉల్ హక్ కోహ్లీ చేతిని నెట్టివేయడం, కోహ్లీ ఏదో అనడం.. అనంతరం కైల్ మేయర్స్ కలగజేసుకోవటం.. ఇలా ప్రతి చిన్న విషయం పెద్దగా కనిపించనట్లయ్యింది. ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా, అభిమానుల అత్యుత్సాహం మరోసారి వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. అందుకు ఈ వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ.
ఓ అనామక కోడర్.. కోహ్లీ – గంభీర్ ఫైట్ ను ఆధారంగా చేసుకొని ఓ వీడియో గేమ్‌ని చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “ఈ వీడియోలో మొదట కోహ్లీ, గంభీర్ పాత్రలు ఫీల్డ్ డిజైన్ చేయబడతాయి. ఆ తరువాత నడకతో గేమ్ ప్రారంభమవుతుంది. ఆపై ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరితో మరొకరు క్రికెట్ బ్యాట్‌లతో పోరాడుకోవడం మనం చూడవచ్చు. చివరకు ఈ పోరాటంలో లక్నో సాధిస్తుంది”. ఇది ఫన్నీగా రూపొందించినప్పటికీ, ఈ వీడియోలో కోహ్లీ, లక్నో ఆటగాళ్ల చేతిలో ఓడినట్లు చూపించడం ఆర్‌సీబీ అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు. ఈ గేమ్ క్రియేట్ చేసిన కోడర్‌పై విమర్శలు చేస్తున్నారు. కాగా, గంభీర్, కోహ్లి మధ్య గొడవలు జరగడం ఇదేంతొలిసారి కాదు. 2013లో, ఆర్ సీబీ, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా వీరిద్దరి మధ్య ఫైట్ జరిగింది. ఈ వీడియో గేమ్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
I made a game so that #ViratKohli and #GautamGambhir can fight properly.
try it at: https://t.co/LnNCyatmMc #IPL2023 pic.twitter.com/SvTJPa27en
— Aerø (@aeronzero) May 7, 2023