ధనాధన్ లీగ్ మొదలవ్వడమే కాకుండా.. ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. శనివారం పంజాబ్- కోల్ కతా మధ్య జరిగిన మ్యాచ్ వర్షం రావడంతో నిలిచిపోయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో ఉమేష్ యాదవ్ ఆల్ టైమ్ ఐపీఎల్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఐపీఎల్ 2023లో ప్రతి మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను మిగులుస్తోంది. శనివారం జరిగిన కోల్ కతా నైట్ రైడర్స్- పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కూడా అలాంటిదే. ఈ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్ కతా పోరాటం వృథా పోయింది. వర్షం ఆటంకం కలిగించకపోతే మాత్రం శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన కచ్చితంగా మ్యాచ్ ని తిప్పేసేవారని చెప్పచ్చు. ఇద్దరూ అంత ఫామ్ లో కనిపించారు. మ్యాచ్ పోయినప్పటికీ.. ఉమేష్ యాదవ్ కి మాత్రం కలిసొచ్చింది. ఐపీఎల్ హిస్టరీలో అద్భుతమైన రికార్డును ఉమేష్ యాదవ్ బ్రేక్ చేశాడు.
శనివారం మొహాలీ వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్- కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కోలకతా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ రికార్డు బ్రేక్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్ గా ఉన్నాడు. అదేంటంటే.. ఐపీఎల్ లో ఒక జట్టుపై అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా ఉమేష్ యాదవ్ రికార్డుల కెక్కాడు. గతంలో ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్రౌండర్ బ్రావో పేరిట ఉండేది. బ్రావో ముంబైపై అత్యధికంగా 33 వికెట్లు తీశాడు. పంబాజ్ తో జరిగిన మ్యాచ్ లో రాజపక్స వికెట్(34) తీసి ఉమేష్ యాదవ్.. బ్రావో రికార్డ్ బ్రేక్ చేశాడు.
ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. తొలుత బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేశారు. రాజపక్స(50), ధావన్(40), సామ్ కరన్(26) రాణించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కోల్ కతా 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో కోల్ కతాకు 154 పరుగుల విజయం లక్ష్యం నిర్ణయించారు. 7 పరుగులు తక్కువ కావడంతో పంజాబ్ ని విజేతగా ప్రకటించారు. ఉమేష్ యాదవ్ రికార్డు బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Umesh Yadav holds the record for most wickets against a team in Indian T20 League.
(Photo Source: Twitter)#SKY11 #IndianT20League #T20cricket #ITL2023 #KLRahul #Lucknow #Delhi #DavidWarner #KyleMayers #UmeshYadav #SunilNarine pic.twitter.com/tDVe1jdYMY
— Sky11 (@sky11official) April 2, 2023