ఐపీఎల్ లో భాగంగా చెన్నై తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు తుషార్ దేశ్ పాండే. అయితే అలాంటి బౌలర్ కూడా ప్రస్తుతం ఒక విషయంలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు.
ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్. లీగ్ దశలో అదిరిపోయే ప్రదర్శన చేసిన ధోని సేన నిన్న జరిగిన క్వాలిఫయర్ 1 లో గుజరాత్ టైటాన్స్ మీద ఘన విజయం సాధించి ఫైనల్ కి దూసుకెళ్లింది. దీంతో ఇప్పటివరకు ఐపీఎల్ లో 10 సార్లు ఫైనల్ కి వెళ్లిన తొలి జట్టుగా చెబున్నాయి సూపర్ కింగ్స్ నిలిచింది. జట్టులో అందరూ బాగా బ్యాటింగ్ చేయడంతో పాటుగా, బ్యాటింగ్ చేస్తూ సమిష్టి ప్రదర్శన చేయడం వలెనే ఇది సాధ్యమైంది. అయితే ఇప్పుడు తుషార్ దేశ్ పాండే మీద ఒక అభిమాని దారుణంగా ట్రోల్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఐపీఎల్ లో భాగంగా చెన్నై తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు తుషార్ దేశ్ పాండే. అయితే అలాంటి బౌలర్ కూడా ప్రస్తుతం ఒక విషయంలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. దానికి కారణం ఈ పేస్ బౌలర్ ప్రతి మ్యాచులో వికెట్లు తీసినా.. ఎకానమీ మాత్రం ఎక్కువగా ఉండడం గమనార్హం. చెన్నై బౌలింగ్ ని ఒకసారి పరిశీలిస్తే.. అందరూ పొదుపుగా బౌలింగ్ చేస్తుంటే దేశ్ పాండే మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఒక చెన్నై అభిమాని దేశ్ పాండేని ఉద్దేశించి వీడు ప్రతి మ్యాచులో 40 పరుగులు ఇస్తాడు. చెన్నైలో ఒక బౌలింగ్ లో రన్ మెషీన్ ఉన్నాడు. అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.
అయితే దీనికి దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు ఈ చెన్నై పేస్ బౌలర్. ” నీకు ధైర్యం ఉంటె నీ అంతటా నువ్వు బౌండరీ రోప్ దాటి రా చూసుకుందాం. నేను బెట్ కడుతున్నాను. కనీసం నువ్వు బౌండరీ రోప్ కూడా దాటి రాలేవు అని సవాల్ విసిరాడు. దీంతో ఇప్పుడు దేశ్ పాండే ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. క్రికెటర్ల మీద ట్రోల్స్ రావడం సహజం. కానీ వాటిని ఒక ప్లేయర్ ఇంతలా సీరియస్ గా తీసుకోవడం ఆశ్చర్యం కలుగుతుంది. మొత్తానికి చెన్నై అభిమాని మీద దేశ్ పాండే ఇచ్చిన రిప్లై మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Tushar Deshpande gives a befitting reply to a fan on Twitter.
(A fan trolled him for leaking 40 runs in every match and tagged him & CSK)#TusharDeshpande #CSK pic.twitter.com/1aEznHfrrL
— CricTracker (@Cricketracker) May 24, 2023