ఐపీఎల్ 2023లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుకు చుక్కలు చూపించాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. తనను కొనలేదన్న కసితో, కసితీరా కొట్టాడు. దాంతో కావ్యా పాప తెల్ల మెుహం వేసింది.
ఐపీఎల్ 2023 సీజన్ లో ఓ యంగ్ ప్లేయర్ దుమ్మురేపుతున్నాడు అతడే తిలక్ వర్మ. తెలుగు కుర్రాడు అయినప్పటికీ ముంబై జట్టుకు ఆడుతున్నాడు ఈ టాలెంటెడ్ ప్లేయర్. తనకు అవకాశం లభించిన ప్రతీసారి తానేంటో నిరూపించుకుంటూనే ఉన్నాడు. తాజాగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుకు చుక్కలు చూపించాడు తిలక్ వర్మ. ఓ తెలుగు కుర్రాడు తెలుగు జట్టుపై తన ప్రతాపం చూపించాడు. వేలంలో తనను కొనుగోలు చేయలేదు అన్న కసి అతడి ఆటలో స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కావ్యా పాపపై కసితో ఈ మ్యాచ్ లో తన విశ్వరూపం చూపాడు. ఉన్నంత సేపు ఎడాపెడా సిక్సర్లు బాది.. సన్ రైజర్స్ బౌలర్లను బెంబేలెత్తించాడు. తిలక్ వర్మ ధాటికి ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.
తిలక్ వర్మ.. ప్రస్తుతం ఐపీఎల్ లో మారుమ్రోగుతున్న పేరు. తెలుగు కుర్రాడు అయిన తిలక్ వర్మ.. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. ఈ సీజన్ లో దుమ్మురేపుతున్నాడు. తాజాగా మంగళవారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో అయితే తన విశ్వరూపం చూపాడనే చెప్పాలి. సూర్య కుమార్ అవుటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మ.. తనదైన స్టైలిష్ షార్ట్స్ తో రెచ్చిపోయాడు. కేవలం 17 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 37 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్ కు చేరాడు. అయితే తిలక్ వర్మ అవుట్ అయినప్పటికీ అతడు చేయాల్సిన నష్టం చేశాడు. ముంబై జట్టు 12 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది.
ఈ క్రమంలో క్రీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మ.. ముంబై ఇండియన్స్ స్కోర్ కార్డ్ ను పరుగులు పెట్టించాడు. చూడముచ్చటైన క్రికెట్ షాట్స్ తో అలరించాడు. ఇక అతడు ఆడుతున్నంత సేపు కావ్యా పాప మెుహంలో చిరునవ్వు లేదు. అతడిని ఎందుకు కొనలేదు అన్న బాధ తప్పితే. ఐపీఎల్ మినీ వేలంలో తిలక్ వర్మను దక్కించుకుందానికి కొంత వరకు సన్ రైజర్స్ ఓనర్ కావ్యా పాప ప్రయత్నించింది. కానీ చివరిలో అతడిని వదిలేసింది. ఓ తెలుగు కుర్రాడిని అందులోనా యంగ్ ప్లేయర్ ను కొనుగోలు చేయకపోతే ఎలాంటి నష్టం జరుగుతుందో చేసి చూపిండు తిలక్ వర్మ. అతడి దెబ్బకు కావ్యా పాప బిక్కమెుహం వేసింది. ముంబై జట్టు 192 పరుగులు చేసింది అంటే అది తిలక్ వర్మ చలవనే చెప్పాలి. ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడిన ఇతడు.. బెంగళూర్ టీమ్ పై (84*), సీఎస్కేపై(22), ఢిల్లీపై(41), కేకేఆర్ పై(30) పరుగులు చేశాడు. ప్రస్తుతం 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా తిలక్ వర్మ ఉన్నాడు. ఇక ఇతడి బ్యాటింగ్ చూసి ఎందుకు కొనలేదా? అని బాధపడుతోంది కావ్యా పాప.