Tilak Verma: ఇద్దరు తెలుగు క్రికెటర్లు ముంబై ఇండియన్స్ టీమ్‌కు తమ బెస్ట్ ఇవ్వడంపై తెలుగు క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై టీమ్‌లో తిలక్ వర్మ కీలక ప్లేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌కు మంచి స్టార్ట్ లభించలేదు. ఆడిన రెండో మ్యాచ్‌ల్లోనూ రోహిత్ సేన ఓటమి పాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై.. తాజాగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలోనూ ఓడింది. అసలే గత సీజన్‌లో వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడిన చెత్త రికార్డును మూట గట్టుకున్న ముంబై.. ఈ సీజన్‌ను సైతం రెండు వరుస ఓటములతో మొదలుపెట్టింది. అయితే.. జట్టు పరిస్థితి ఎలాగున్నా.. ఆ జట్టులోని యువ క్రికెటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఆర్సీబీపై 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 84 పరుగులు చేసి ఒంటి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమైనా.. తిలక్ వర్మ పోరాటంతో ముంబై 171 పరుగుల స్కోర్ చేయగలిగింది.
శనివారం చెన్నైపై కూడా 22 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ క్రమంలోనే తిలక్ వర్మ ఒక అరుదైన రికార్డు సాధించడంమే కాకుండా.. ముంబై తొలి కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రస్తుత కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రికార్డులను బద్దలుకొట్టాడు. ఇంతకీ తిలక్ వర్మ ఏ రికార్డు సాధించాడంటే.. ముంబై ఇండియన్స్ తరఫున ఆడి అత్యంత వేగంగా 500 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ల లిస్ట్‌లో తిలక్ మూడో స్థానంలో నిలిచాడు. తిలక్ కేవలం 16 ఇన్నింగ్స్‌ల్లోనే 500 మార్క్‌ను దాటేశాడు. ఈ మార్క్ దాటేందుకు సచిన్ టెండూల్కర్‌కు 19 ఇన్నింగ్స్‌లు, హిట్ మ్యాన్ రోహఙత్ శర్మకు 21 ఇన్నింగ్స్‌లు పట్టడం గమనార్హం.
అయితే ఈ జాబితాలో వెస్టిండీస్ బ్యాటర్ లెండిల్ సిమన్స్ అందరి కంటే ముందు ఉన్నాడు. ముంబై తరఫున ఆడిన అతను కేవలం 12 ఇన్నింగ్స్‌ల్లోనూ 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సిమన్స్ తర్వాత సనత్ జయసూర్య, సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డికాక్ కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లో 500 మార్క్ అందుకున్నాడు. వీరు ముగ్గురు జాయింట్‌గా రెండో స్థానంలో ఉంటే.. మూడో స్థానంలో తిలక్ శర్మ 16 ఇన్నింగ్స్‌లతో ఉన్నాడు. నాలుగో ప్లేస్‌లో మరో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు 18 ఇన్నింగ్స్‌లతో ఉన్నాడు. ఇలా ఇద్దరు తెలుగు క్రికెటర్లు ముంబై ఇండియన్స్ టీమ్‌కు తమ బెస్ట్ ఇవ్వడంపై తెలుగు క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై టీమ్‌లో తిలక్ వర్మ కీలక ప్లేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే. రాయుడు సీఎస్‌కే జట్టులో ఉన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Big Alert 🚨.
Tilak Varma is the future.. pic.twitter.com/VMfBqP9uKu
— Vishal. (@SPORTYVISHAL) April 2, 2023