ముంబయి బ్యాటర్ తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్.. హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య పాప కొంప ముంచింది. నెటిజన్స్ అయితే రెచ్చిపోయి మరీ ఈమెని టార్గెట్ చేస్తున్నారు. అసలు ఇద్దరి మధ్య సంబంధమేంటి? ప్రస్తుతం ఏం జరుగుతోంది?
ముంబయితో ఆదివారం జరిగిన మ్యాచులో ఆర్సీబీ గెలిచింది. ఈ సీజన్ లో తొలి విక్టరీ నమోదు చేసింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ గురించి అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు. కింగ్ రిట్నర్స్ అని తెగ పొగిడేస్తున్నారు. కానీ ఇదే పోరులో కోహ్లీ కంటే రెండు రన్స్ ఎక్కువ కొట్టి, ముంబయి పరువు కాపాడిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గురించి చాలా తక్కువమంది డిస్కస్ చేస్తున్నారు. అదే టైంలో ఈ మ్యాచుతో ఎలాంటి సంబంధం లేని హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు వీళ్లిద్దరికీ లింకేంటి? ఏం జరుగుతోంది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు రాజస్థాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. బౌలర్లు, బ్యాటర్లు పూర్తిగా ఫెయిలయ్యారు. దీంతో ప్రతి ఒక్కరూ ఓనర్ కావ్య పాపని విమర్శిస్తున్నారు. ఎందుకంటో రూ 13 కోట్లు పెట్టి హ్యారీ బ్రూక్ ని కొంటే.. ఆ బ్యాటర్ తొలి మ్యాచ్ లో కోటికి ఒకటి చొప్పున అన్నట్లు 13 రన్స్ మాత్రమే కొట్టాడు. హైదరాబాద్ బౌలర్లు తొలుత పరుగులు సమర్పించుకోగా.. ఛేదనలో బ్యాటర్లు చేతులెత్తేశారు. అబ్దుల్ సమాద్ 32 నాటౌట్, మయాంక్ అగర్వాల్ 27 మాత్రం కాస్త చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.
మరోవైపు బెంగళూరుతో మ్యాచ్ లో ముంబయి తరఫున ఆడిన తిలక్ వర్మ చితక్కొట్టేశాడు. 84 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే కావ్య పాపని నెటిజన్స్ టార్గెట్ చేశారు. తిలక్ వర్మ లాంటి టాలెంట్ ఉన్న తెలుగు ఆటగాళ్లని కాదని.. ఎవరెవరినో కోట్లు పెట్టి కొంటున్నారు. ఎంచక్కా తిలక్ లాంటి వాళ్లనే తీసుకుంటే.. తక్కువకే వేలంలో దొరుకుతారు కదా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న సగటు క్రికెట్ అభిమానులైతే.. హైదరాబాద్ టీమ్ లో అసలు తెలుగు క్రికెటర్లు ఎక్కడున్నారు? అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి తిలక్ వర్మ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లని కొనుగోలు చేయకుండా హైదరాబాద్ జట్టు పొరపాటు చేసిందా? దీనిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.