Suyash Sharma: ఆర్సీబీ లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుపై ఓ యువ క్రికెటర్ విచిత్రమై బౌలింగ్ యాక్షన్‌తో మూడు వికెట్లు సాధించాడు. విశేషం ఏంటంటే.. అతనికి గతంలో ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడిన అనుభవం లేదు.. గల్లీ క్రికెట్ నుంచి వచ్చి.. ఆర్సీబీకి పోయించాడు.
ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. గురువారం కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దారుణంగా ఓటమి పాలైంది. విచిత్రం ఏంటంటే.. ఆర్సీబీపై అద్భుత ప్రదర్శన కనబర్చిన కేకేఆర్, తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓటమి పాలైంది. ఇలా ఊహకు అందని విధంగా ఐపీఎల్ థ్రిల్లింగ్‌గా సాగుతోంది. 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి, ఆండ్రూ రస్సెల్ లాంటి విధ్వంసకర బ్యాటర్ డకౌట్ అయినా కూడా 204 పరుగుల భారీ స్కోర్ చేసింది కేకేఆర్. టార్గెట్ భారీగా ఉన్నా.. కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, బ్రేస్‌వెల్, దినేష్ కార్తీక్‌లతో బలంగా ఉన్న ఆర్సీబీ ఛేదిస్తుందనుకుంటే.. కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. ఆరంభంలోనే సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి ఆర్సీబీని చావు దెబ్బతీస్తే.. మధ్యలో ఓ యువ బౌలర్ సైతం ఆర్సీబీ బ్యాటర్లతో ఆడుకున్నాడు.
సుయాష్ శర్మ.. నిన్నటి వరకు ఈ పేరు ఎవరీ తెలియదు. కానీ, ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ తర్వాత ఎవరీ సుయాష్ అంటూ క్రికెట్ అభిమానులు గూగుల్‌లో తెగ సెర్చ్ చేశారు. ఎంత సెర్చ్ చేసినా.. పెద్దగా సమాచారం లేదు. ఎందుకంటే.. అతను గతంలో పెద్దగా క్రికెట్ ఆడలేదు. నేరుగా ఐపీఎల్‌లో తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. అంతకుముందంతా.. గల్లీ క్రికెట్టే. నిజం.. ఒక గల్లీ క్రికెటర్ వచ్చి.. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడి ఆర్సీబీని వణికించాడు. మూడు వికెట్లు సైతం పడగొట్టాడు. ఈ కుర్ర బౌలర్ చేతిలో దినేష్ కార్తీక్ లాంటి పవర్ హిట్టర్ సైతం అవుట్ అయ్యాడు. అందుకే.. ప్రస్తుతం సుయాష్ శర్మ టాక్ ఆఫ్‌ది క్రికెట్ టౌన్‌గా మారిపోయాడు.
వెరైటీ బౌలింగ్ యాక్షన్..
19 ఏళ్ల సుయాష్ ఢిల్లీలో పుట్టి పెరిగాడు. గల్లీ క్రికెట్‌తో పాటు.. చిన్న చిన్న టోర్నీలు ఆడుతూ ఉండేవాడు. ఇప్పటి వరకు ఏ ఒక్క దేశవాళీ మ్యాచ్ సైతం ఆడలేదు. ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ ఇలా ఎందులోనే పాల్గొనలేదు. కేకేఆర్ టాలెంట్ హాంట్ టీమ్ కంట పడిన సుయాష్ శర్మ.. ఐపీఎల్ కాంట్రాక్ట్ అందుకున్నాడు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో సుయాష్‌ను కేకేఆర్ కేవలం బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు దక్కించుకుంది. సుయాష్‌ను టీమ్‌లోకి తీసుకున్న తర్వాత.. కేకేఆర్ ఓనర్ ఏమన్నారంటే.. సుయాష్ కోసం ఫ్రాంచైజ్‌లు పోటీ పడకపోవడం తమకు చాలా ఆశ్చర్యం కలిగించింది, టాలెంటెడ్ ప్లేయర్ ఇంత తక్కువ ధరకు దక్కినందుకు చాలా సంతోషం ఉందని పేర్కొన్నాడు. అప్పుడు ఆయన మాటలు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
కానీ.. గురువారం ఆర్సీబీతో మ్యాచ్‌లో సుయాష్ ప్రదర్శన చూసిన తర్వాత.. కేకేఆర్ ఓనర్ అలా ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది. అయితే.. సుయాష్ బౌలింగ్‌లో వేరియేషన్స్‌తో పాటు బౌలింగ్ యాక్షన్ సైతం చాలా వైరటీగా ఉంది. బాల్ రిలీజ్ చేసే సమయంలో ఏ బౌలరైనా బాల్‌ను ఎక్కడ పిచ్ చేయాలోని చూసి వేస్తారు. అలాగే బ్యాటర్ల కదలికలకు అనుగుణంగా బాల్‌ను చివరి నిమిషంలో మార్చేందుకు ప్రయత్నిస్తారు. కానీ సుయాష్ మాత్రం బాల్ రిలీజ్ చేసే సమయంలో ఆకాశం వైపు చూస్తూ వేస్తున్నాడు. దాంతో బాల్ ఎక్కడ పడుతుందో బ్యాటర్‌కే కాదు, అతనికి కూడా తెలియదేమో అనేలా ఉంది అతని బౌలింగ్ యాక్షన్. అయితే.. అదే అతనికి ప్లేస్‌గా కూడా మారింది. అతని వైరటీ బౌలింగ్ యాక్షన్‌తో బ్యాటర్ ప్రీడిటర్‌మైండ్ షాట్‌ను ఆడటం చాలా కష్టంగా మారింది. దీంతో బాల్‌ను జాగ్రత్తగా చూసి ఆడాల్సిన పరిస్థితి. అయితే.. తొలి ఓవర్‌లో ఒక ఓవర్ షార్ట్ పిచ్ బాల్‌ను బ్రేస్‌వెల్ సిక్స్‌గా మలిచాడు. ఆ బాల్ మినహా మిగతా బంతులన్ని బాగా వేశాడు సుయాష్. 4 ఓవర్ల కోటా పూర్తి చేసిన సుయాష్ 30 పరుగులు ఇచ్చి.. 3 వికెట్లు పడగొట్టాడు.
వరంలా మారిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్..
గతంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఆటగాడిని నేరుగా ఐపీఎల్‌లో అందులోనూ ఆర్సీబీ లాంటి పటిష్టమైన జట్టుపై ఆడించడం అంటే సాహసం అనే చెప్పాలి. అయితే.. కేకేఆర్ అలాంటి రిస్క్ తీసుకునేందుకు కొత్తగా ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ రూల్ బాగా ఉపయోగపడింది. సాధారణంగా సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి లాంటి మిస్టరీ స్పిన్నర్ ఉన్న జట్టులో మరో స్పిన్నర్‌కు చోటు దక్కడం అసాధ్యం అందులోనూ ఒక్క మ్యాచ్ కూడా ఆడిన అనుభవం లేని ఆటగాడికి అయితే చాలా కష్టం. కానీ.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ సుయాష్‌కు వరంలా మారింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ పేస్ బౌలర్లను సులవుగా ఆడినా.. స్పిన్‌లో తడబడింది. దీంతో.. ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగిన సమయంలో.. వెంకటేశ్ అయ్యర్‌ను కూర్చోబెట్టి, అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సుయాష్ శర్మను తీసుకున్నారు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకున్న సుయాష్.. మూడు వికెట్లతో సత్తా చాటాడు. మరి ఈ యువ బౌలర్ బౌలింగ్ యాక్షన్‌తో పాటు ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
No First-class match, No List A match, No T20 match in his career before this game.
And Suyash has made a remarkable IPL debut. pic.twitter.com/95n7VV7Q0h
— Johns. (@CricCrazyJohns) April 6, 2023