ప్రస్తుతం ఎక్కడ చూసిన జైస్వాల్ ఇన్నింగ్స్ గురించే చర్చ. విరాట్ కోహ్లీ, వార్నర్, రోహిత్ శర్మ లాంటి అగ్ర బ్యాటర్లు జైస్వాల్ ఇన్నింగ్స్ గురించి అభినందిస్తూ ట్వీట్ చేశారు.ఈ ఇన్నింగ్స్ కి ఇంప్రెస్స్ అయిన భారత మాజీ స్టార్ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా.. జైస్వాల్ ని ఆకాశానికెత్తేసాడు.
రాజస్థాన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ కి ఒకొక్కరు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ లో ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడిన జైస్వాల్ నిన్న కేకేఆర్ మీద జరిగిన మ్యాచులో శివాలెత్తే ఇన్నింగ్స్ ఆడాడు. ఏ బౌలర్ ని వదలకుండా బౌండరీలు కొట్టే పనిలోనే ఉన్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ రికార్డ్ తన పేరునా లిఖించుకున్నాడు. అంతేకాదు అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో డుప్లెసిస్ తర్వాత స్థానంలో నిలిచాడు. జట్టుకి విజయాన్ని అందించడమే కాదు ఏకంగా ఈ యంగ్ బ్యాటర్ ధాటికి రాజస్థాన్ నెట్ రన్ రేట్ అమాంతం పెరిగింది. ఈ ఇన్నింగ్స్ కి ఇంప్రెస్స్ అయిన భారత మాజీ స్టార్ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా.. జైస్వాల్ ని ఆకాశానికెత్తేసాడు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన జైస్వాల్ ఇన్నింగ్స్ గురించే చర్చ. విరాట్ కోహ్లీ, వార్నర్, రోహిత్ శర్మ లాంటి అగ్ర బ్యాటర్లు జైస్వాల్ ఇన్నింగ్స్ గురించి అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇక రైనా అయితే ఏకంగా జైస్వాల్ ని ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేయాలని సూచించాడు. ఈ సందర్భంగా జియో సినిమాతో రైనా మాట్లాడుతూ.. “నేనే ఇండియన్ సెలెక్టర్ అయితే ఈ రోజే జైస్వాల్ ని వన్డే వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేసేవాడిని. అతడు చాలా ఫ్రెష్ మైండ్ తో ఉన్నాడు. అతడు బ్యాటింగ్ ఆడుతుంటే వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుకొస్తున్నాడు. రోహిత్ శర్మ ఈ ఇన్నింగ్స్ చూస్తాడని అనుకుంటున్నాను. వరల్డ్ కప్ లో రోహిత్ వెతికే బ్యాటర్లలో ఖచ్చితంగా జైస్వాల్ కూడా ఉంటాడు”. అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. మరి రైనా జైస్వాల్ మీద చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయి కామెంట్ల రూపంలో తెలపండి.