సన్ రైజర్స్ వరస్ట్ అంటే వరస్ట్ గా మారిపోతోంది. ఈ సీజన్ లో అయితే జట్టులో ఏ ఆటగాడు తమకు సంబంధం లేదన్నట్లే ఆడుతూ వచ్చారు. కానీ ఒక్క ప్లేయర్ మాత్రం తన వంతు బ్యాటింగ్ చేసి పరువు కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఏం లాభం అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందిగా.
సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈ జట్టుని వరస్ట్ అని చెప్పడానికి ఎలాంటి మొహమాటం అక్కర్లేదు. వెతక్కపోయినా సరే తిట్టడానికి వంద కారణాలు దొరుకుతున్నాయి. జట్టులోని ప్లేయర్స్ అలా చేస్తున్నారు. ఇలా తిడుతుంటే ఫ్యాన్స్ కూడా అస్సలు బాధపడరు. ఎందుకంటే వాళ్లకీ తెలుసు.. సొంత టీమ్ కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం. లేదంటే ఇలాంటి చెత్త టీమ్ ని ఎవడు పట్టించుకుంటాడు అని ముఖం మీదే అనేస్తారు. ఈ సీజన్ ప్రారంభంలో ఒకటి-రెండు మ్యాచ్ ల్లో ఏదో కాస్త ఆడినట్లు కనిపించింది కానీ మిగతా అన్ని మ్యాచుల్లో కనీసం గేమ్ స్పిరిట్ అన్నదే లేకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసింది. కానీ ఈ జట్టులో ఆడుతున్న ఒకే ఒక్క ప్లేయర్ మాత్రం సన్ రైజర్స్ పరువు కాపాడుతున్నాడు.
అసలు విషయానికొచ్చేస్తే.. సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు చెప్పగానే వార్నర్, విలియమ్సన్, రషీద్ ఖాన్ ఇలా అద్భుతమైన ప్లేయర్లు గుర్తొస్తారు. 2016లో కప్ గెలుచుకున్న టైమ్ లో మన జట్టుని చూసి ప్రతి ఒక్కరూ భయపడేవాళ్లు. అంత స్ట్రాంగ్ గా ఉండేది. జట్టులో ఒక్క తెలుగు ప్లేయర్ లేకపోయినా సరే అభిమానులు చాలా ఆదరించేవారు. కానీ సీజన్లతోపాటే పరిస్థితులు మారిపోయాయి. వార్నర్ ని అవమానించారు. రషీద్ ని వదులుకున్నారు. విలియమ్సన్ ని బయటకు పంపించేశారు. ఇలా జట్టుని చేజేతులా షెడ్ లోకి తీసుకెళ్లి పడేశారు. ఇక ఈ సీజన్ కి కప్ కొట్టేస్తాం అన్నంత హడావుడి చేశారు.
సన్ రైజర్స్ ఈ సీజన్ కోసం మార్క్రమ్, హ్యారీ బ్రూక్, జాన్సన్ లాంటి వాళ్లని కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. వీళ్లు కప్పు తీసుకొస్తారని తెగ ఆశపడింది. కానీ రియాలిటీలో పూర్తి విరుద్ధంగా జరిగింది. ఆ బ్రూక్ అయితే రూ.13 కోట్లకు కనీసం న్యాయం చేయలేదు. ఒక్క మ్యాచ్ లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత కోడి గుడ్లు పెడుతున్నట్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. కెప్టెన్ మార్క్రమ్ అయితే అసలు జట్టుని ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. బౌలర్లలో భువనేశ్వర్ ఓకే గానీ స్థాయికి తగ్గ ఫెర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు. తాజాగా గుజరాత్ తో మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ.. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సన్ రైజర్స్ సీజన్ నుంచి ఎలిమినేట్ కూడా అయిపోయింది.
సన్ రైజర్స్ తాజాగా మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 188/9 స్కోరు చేసింది. ఛేదనలో హైదరాబాద్ జట్టులోని క్లాసెన్ (44 బంతుల్లో 64 పరుగులు) తప్పితే ఒక్కరంటే ఒక్కరు కూడా ఆడలేదు. దీంతో 154/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ లోనే కాదు ఈ సీజన్ లో తొమ్మిది మ్యాచ్ లాడి వరసగా 16, 36, 17, 31, 53, 36, 26, 47, 64.. ఇలా తన వంతు ప్రయత్నించాడు. గంగలో కలిసిపోవాల్సిన సన్ రైజర్స్ కాస్త కాపాడుతూ వచ్చాడు. మనోడి వల్ల ఈ మాత్రమే సన్ రైజర్స్ ఆడుతూ వచ్చింది గానీ ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయేది. సో అదన్నమాట విషయం. కోట్లు పెట్టి కొన్న ప్లేయర్స్ ఏమో సన్ రైజర్స్ కి బొమ్మ చూపిస్తే.. క్లాసెన్ మాత్రం పరువు కాపాడాడు. మరి ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఆటతీరుపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Lone Warrior for SRH today.
A brilliant fifty by classy #klaasen saved his team from humiliation otherwise it would have been the same story like RR yesterday performance #GTvSRH #fighter #henrich #bhuvi scored more runs than SRH top order giving his best for his team pic.twitter.com/afMExRTIet— Krishna Singh (@Krishna70329359) May 15, 2023