కేరళలోని కొచ్చిలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభం అయ్యింది 2023 ఐపీఎల్ మినీ వేలం. ఇక తొలిరోజు వేలంలో అంచనాలకు మించి భారీ ధరలతో ఆటగాళ్ల కొనుగోళ్లు జరిగాయి. ఇక ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసిందనే చెప్పాలి. సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్, హ్యారీ బ్రూక్ లు ఈ వేలంలో అత్యధిక ధర పలికి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే ఈ సారి హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాటర్లపై దృష్టి సారించింది. ఇంగ్లాండ్ నయా సంచలనం హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ హెన్రిక్ క్లాసెన్ పై కోట్లు కురిపించింది. కానీ సన్ రైజర్స్ జట్టులో ఆల్ రౌండర్లు ఎక్కడా కనిపించడం లేదు. అదీకాక SRH దగ్గర ఇంకా రూ. 7.75 కోట్లు ఉండటం గమనార్హం. దాంతో ఆల్ రౌండర్లు ఎక్కడ? కావ్యా పాప అంటూ హైద్రబాద్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
IPL లాంటి మెగా టోర్నీలు గెలవాలి అంటే.. జట్టులో ఆల్ రౌండర్లది కీలక పాత్ర. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది కూడా. మరి అలాంటి ఆల్ రౌండర్లను వదిలి పెట్టి.. ఇలా ఎక్కవ మెుత్తం లో బ్యాటర్లను ఈ ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ సన్ రైజర్స్ కొనుగోలు చేయడానికి కారణాలు ఏంటా? అని అభిమానులు తలలు గోక్కుంటున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. వేలం ముగిశాక కూడా SRH దగ్గర ఇంకా రూ. 8 కోట్లు ఉన్నాయి. ఇక 2023 మినీ ఐపీఎల్ వేలంలోకి రూ. 42.25 కోట్లతో బరిలోకి దిగింది సన్ రైజర్స్. ఈ వేలంలో స్టార్ ఆల్ రౌండర్లు అయిన సామ్ కర్రన్, గ్రీన్, బెన్ స్టోక్స్ కోసం ఫ్రాంఛైజీలు ఎగబడితే.. సన్ రైజర్స్ మాత్రం బ్యాటర్లపై దృష్టి పెట్టింది.
ఈ వేలంలో ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కోసం ఏకంగా రూ.13.25 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఇండియన్ ప్లేయర్ అయిన మయాంక్ అగర్వాల్ ను రూ. 8.5 కోట్లకు దక్కించుకుంది. సౌతాఫ్రికా వికెట్ కీపర్ అయిన క్లాసేన్ ను రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది సన్ రైజర్స్. వీరితో పాటుగా దేశీయ, విదేశీ ఆటగాళ్లను సైతం సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. వారిలో ఆల్ రౌండర్లు లేకపోవడం గమనార్హం. ఈ విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జట్టు కూర్పులో ఎంతో స్ట్రాటజితో వ్యవహిరించే కావ్యా మారన్ ఏంటి ఇలా చేసింది అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేలంలో బెన్ స్టోక్స్ కోసం చివరి వరకు బిడ్ వేసిన రైజర్స్ ఆఖర్లో అతడిని వదిలి పెట్టారు. భారీ మెుత్తంతో వేలంలోకి అడుగుపెట్టిన SRH ఆల్ రౌండర్లపై దృష్టి పెట్టకపోవడం ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేసే విషయమే. మయాంక్ దగర్ అనే ఆల్ రౌండర్ ను మాత్రమే రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది రైజర్స్. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని రూ.20 లక్షలకు కొనుగోలు చేశారు.
What do you make of this buy folks? 💰💰
Congratulations to Harry Brook who joins @SunRisers #IPLAuction | @TataCompanies pic.twitter.com/iNSKtYuk2C
— IndianPremierLeague (@IPL) December 23, 2022
ఇక సన్ రైజర్స్ ప్లేయింగ్ లెవన్ వివరాల్లోకి వస్తే.. ఓపెనర్లుగా రైట్ హ్యాండ్ కమ్ లెఫ్ట్ హ్యాండ్ జోడీగా మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మలు దిగుతుండగా.. మిడిలార్డర్ లో ఇంగ్లాండ్ నయా సంచలనం హ్యారీ బ్రూక్ తో పాటుగా క్లాసెన్, మార్క్రమ్ లు ఆడనున్నారు. లోయర్ మిడిలార్డర్ లో యువ ఆటగాడు అబ్దుల్ సమద్ తో పాటుగా ఆల్ రౌండర్ వాషిగ్టంటన్ సుందర్ దిగనున్నారు. ఇక రైజర్స్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడపనున్నాడు భువనేశ్వర్ కుమార్. అతడితో పాటుగా స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, త్యాగిలు తుది జట్టులో ఉండనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్యాటింగ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ కమ్ కీపర్ గ్లెన్ ఫిలిఫ్ సైతం అడే అవకాశాలు ఉన్నాయి.
— IndianPremierLeague (@IPL) December 23, 2022