David Warner: సన్‌రైజర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన కెప్టెన్ అతను. ఆర్సీబీకి కోహ్లీ, సీఎస్‌కేకు ధోని, ముంబైకి రోహిత్‌లా.. ఎస్‌ఆర్‌హెచ్‌కు వార్నర్ ఉండే వాడు. కానీ అలాంటి ప్లేయర్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం దారుణంగా అవమానించింది. ఇప్పుడు అందుకే ఇలా...
గత రెండు సీజన్లుగా సన్ రైజర్స్‌కి అస్సలు కలిసి రావడం లేదు. అయితే ఈ సీజన్‌లో కుర్రాళ్లతో నిండిన జట్టుని తయారు చేసి అభిమానుల్లో ఆశలు రేపారు. కానీ ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఘోర ఓటమితో ఈ సీజన్ ప్రారంభించింది. అయితే ఈ ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు కెప్టెన్ మార్కరమ్ లేడని.. అందుకే ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక లక్నో తో జరిగిన రెండో మ్యాచ్ లో ఈ దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు జట్టులో చేరినా ఫలితంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ రెండు ఓటములతో ఇప్పుడు టైటిల్ సంగతి పక్కన పెడితే ప్లే ఆఫ్స్‌కి వెళ్ళేది కూడా క్లిష్టంగా మారింది. అసలు వరుస పెట్టి సన్ రైజర్స్ కి ఇలా ఓటములు ఎందుకు ఎదురవుతున్నాయి అని ఒక సారి పరిశీలిస్తే ?
2016లో ఛాంపియన్, 2017లో ప్లే ఆఫ్, 2018లో ఫైనలిస్ట్, 2019 ప్లే ఆఫ్, 2020లో ప్లే ఆఫ్. ఇది ఒకప్పుడు సన్ రైజర్స్ ప్రదర్శన. వరుసగా 5 సీజన్లు ప్లే ఆఫ్ కి వెళ్లింది. వీటికి కారణాలు గమనిస్తే.. ప్రధాన కారణం డేవిడ్ వార్నర్ అని తెలుస్తుంది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఈ ఆస్ట్రేలియన్ స్టార్ సన్ రైజర్స్ కి అందించిన సేవలు ఎవరు మర్చిపోగలరు. భారీ ఇన్నింగ్స్ లు ఆడుతూ ఒంటి చేత్తో మ్యాచ్ లు గెలిపించిన సందర్భాలు అనేకం. అంతే కాదు ప్రతి సీజన్లలో 500కి పైగా పరుగులు సాధించిన ఘనత వార్నర్ సొంతం. ఇందులో రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ విన్నర్. అంతే కాదు తనదైన కెప్టెన్సీ తో అనుకున్న ఫలితాలు రాబట్టగలిగాడు. జట్టులోకి ఎవరు వచ్చిపోయినా.. బలం, బలహీనతలు ఎలా ఉన్నా వార్నర్ ఉన్నాడనే భరోసా సగటు తెలుగు అభిమానికి ఉండేది.
2021 నుంచి సన్ రైజర్స్ పరిస్థితి దారుణంగా తయారయైనది. వార్నర్ బ్యాటింగ్ లో విఫలమవడంతో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి విలియమ్సన్‌కి కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అయితే వార్నర్ ని కెప్టెన్ నుంచి ఎందుకు తప్పించారో సన్ రైజర్స్ యాజమాన్యం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదే విషయమై వార్నర్ అప్పట్లో ప్రెస్ మీట్ లో అడగడం పెద్ద సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. ఆ తర్వాత మ్యాచ్‌లో అనూహ్యంగా వార్నర్ ని తుది జట్టులో నుండి తప్పించి పెద్ద షాక్ ఇచ్చారు. విరామం సమయంలో ప్లేయర్లకు డ్రింక్స్ కూడా మోసుకొని రావడం అభిమానులని తీవ్రంగా బాధించింది. కోచ్, మెంటర్ గా ఉంటున్న టామ్ మూడి, లక్ష్మణ్ లే దీనికి కారణమని అందుకే వార్నర్ కి, సన్ రైజర్స్ యాజమాన్యానికి మధ్య మనస్పర్థలు వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక సన్ రైజర్స్ యాజమాన్యం 2022లో వార్నర్ ని జట్టులో నుండి విడుదల చేసింది. దీంతో వార్నర్ ఢిల్లీ జట్టుకి వెళ్లిపోయాడు.
వార్నర్ ఎప్పుడైతే హైదరాబాద్ జట్టుకి దూరమయ్యాడో అప్పటినుండి సన్ రైజర్స్ జట్టు పతనం మొదలయ్యింది. 2021లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవగా.. 2022లో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక ఈ సీజన్లో ప్రస్తుతం వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. వార్నర్ లాంటి నాణ్యమైన ఆటగాడిని నిర్లక్ష్యం చేసి, లెక్క చేయకుండా సన్ రైజర్స్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. వార్నర్ లాంటి అనుభవజ్ఞుడు జట్టులో ఉంటే బ్యాటింగ్ తో పాటుగా, కెప్టెన్సీ అదరగొట్టేవాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ వార్నర్ ని వదిలేసుకున్నప్పటి నుండి.. టీమ్ విఫలమవడంతో పాటుగా విమర్శలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. వార్నర్ ని అనుమానించడం వల్లే సన్‌రైజర్స్ ఇలాంటి పరిస్థితి వచ్చిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“Karma is a B!tch”
The downfall of SRH is started from here pic.twitter.com/AIm9ZiLrBM
— Ankit Pathak 🇮🇳 (@ankit_acerbic) April 7, 2023