ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్లకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16 లో కూడా అలాంటి ప్లేయర్ల లిస్టులో ఒక బౌలర్ కూడా ఉన్నాడు. అయితే ఈ బౌలర్ మీద ఇప్పుడు భారత మాజీ బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు.
ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్లకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తారు. తమ జట్టుకి మంచి ప్రదర్శన చేస్తాడనే నమ్మకంతో కాస్త రిస్క్ చేసి ఎంత డబ్బు వెచ్చించడానికైనా వెనుకాడరు. ఈ క్రమంలో వేలంలో భారీ మొత్తానికి అమ్ముడుపోయిన ఆటగాళ్లు చెత్త ఆటతీరుతో జట్టుకి భారంగా మారతారు. ఇది కొత్తేమి కాదు ప్రతి ఐపీఎల్ లో ఇది కామన్ గా జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16 లో కూడా అలాంటి ప్లేయర్ల లిస్టులో ఒక బౌలర్ కూడా ఉన్నాడు. అతడెవరో కాదు ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్. అయితే ఈ బౌలర్ మీద ఇప్పుడు భారత మాజీ బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో జోఫ్రా ఆర్చర్ ఎంత ప్రమాదకరమైన బౌలరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదునైన పేస్, యార్కర్లతో చెలరేగే ఆర్చర్ తొలి సారి రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. రాజస్థాన్ జట్టుకి కి ఆడినంత కాలం ఆర్చర్ చాలా బాగా బౌలింగ్ వేసాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ కెరీర్ లో టాప్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ కారణంగానే ఈ పేసర్ పై నమ్మకముంచి గతేడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు 8 కోట్లు పెట్టి ఆర్చర్ ని సొంతం చేసుకుంది. ఆర్చర్ కి అప్పటికే గాయమైనా.. ఆ సీజన్ ఆడడని తెలిసినా.. 2023 సీజన్ కోసం బ్యాకప్ గా ఉంచుకున్నారు. గాయం నుంచి కోలుకొని ఈ ఏడాది సౌత్ ఆఫ్రికా లీగ్ లో ఆడిన ఆర్చర్.. ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
గాయం నుంచి కోలుకొని ఏ ఏడాది సౌత్ ఆఫ్రికా లీగ్ లో ఆడిన ఆర్చర్.. ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఎన్నో అంచనాల మధ్య ఈ ఐపీఎల్ లో బరిలోకి దిగిన ఆర్చర్.. చాలా పూర్తిగా విఫలమయ్యాడు. వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీనికి తోడు మధ్యలో గాయాలు ఆర్చర్ ని బాగా వేధించాయి. దీంతో గాయం కారణంగా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు ఈ స్టార్ బౌలర్. ఆర్చర్ ని కొనుగోలు చేసినందుకు ముంబైకి భారీ నష్టమే జరిగింది. ఏ నేపథ్యంలో ఈ స్టార్ బౌలర్ మీద గవాస్కర్ నిప్పులు చెరిగాడు.
“ముంబై ఇండియన్స్ ఆర్చర్ కోసం భారీ మొత్తం చెల్లించింది. ఫలితంగా వారికి ఏమి లభించలేదు. 100 శాతం ఫిట్ నెస్ గా కూడా ఉండలేకపోయాడు. గాయం విషయంలో అతడు ముందుగానే పూర్తి స్థాయి సమాచారమివ్వాల్సింది.టోర్నీ మధ్యలోనే చికిత్సకోసం స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఈసీబీనే స్వయంగా చెప్పింది. నిజానికి ఈసీబీ కంటే ఐపీఎల్ అతనికి ఎక్కువగా చెల్లిస్తుంది. కానీ అతడు కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. అసలు ఆర్చర్ కి ఒక్క రూపాయి చెల్లించకపోయినా నష్టం లేదని గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు”. మరి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.