Suhana Khan, Shardul Thakur: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ శార్దూల్ ఠాకూర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి బ్యాటింగ్‌కి క్రికెట్ అభిమానులే కాదు.. కేకేఆర్ ఓనర్ షారూఖ్ కూతురు సుహానా ఖాన్ సైతం ఫిదా అయిపోయింది.
గురువారం కోల్‌కత్తాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్. టాస్ గెలిచి బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా.. కేకేఆర్ బ్యాటర్లు ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇన్నింగ్స్ సజావుగా సాగుతున్న తరుణంలో వరుసగా రెండు వికెట్లు. ఆ తర్వాత కాస్త కుదురుకున్నట్టు కనిపించినా.. 89 పరుగులకే 5 వికెట్లు. దీంతో గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆ స్టేడియంలో ఉన్నవాళ్లంతా కేకేఆర్ ఫ్యాన్స్. తమ అభిమాన జట్టు దారుణ పరిస్థితుల్లో ఉండటంతో వారిని నిశ్శబ్దం అవహించింది. ఈ టైమ్‌లో బ్యాటింగ్‌కు దిగిన శార్దూల్ ఠాకూర్ ఆర్సీబీ బౌలర్లను చీల్చిచెండాడు. అప్పటి వరకు కామ్‌గా ఉన్న కేకేఆర్ ఫ్యాన్స్‌ను పూనకాలతో ఊగిపోయేలా చేశాడు శార్దూల్. కేకేఆర్ సహయజమాని షారుఖ్ కూతురు సుహానా ఖాన్ సైతం.. శార్ధూల్ బ్యాటింగ్‌కి ఫిదా అయిపోయింది.
ప్రస్తుతం కోల్‌కత్తా జట్టుకి ఓనర్ గా ఉంటున్న షారుఖ్ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ చూడడానికి వచ్చాడు. కింగ్ ఖాన్ తో పాటుగా కూతురు సుహానా ఖాన్, ఆమె ఫ్రెండ్ షహన్య కపూర్ కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చారు. అయితే మ్యాచ్ ప్రారంభమైన తర్వాత తమ టీమ్ ప్రదర్శన బాగాలేకపోవడంతో నిరాశలో మునిగిపోయారు. అలా ఉన్నవారిలో శార్దూల్, రింకు సింగ్ సంతోషాన్ని నింపారు. ముఖ్యంగా శార్దూల్ బ్యాటింగ్ కి షారుఖ్ గారాల పట్టి పట్టలేనంత ఆనందంతో ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు కనిపించింది. ఇక షహన్య కపూర్ కేకేఆర్ జర్సీ వేసుకొని సందడి చేయగా.. శార్దూల కొట్టిన ఒక సిక్సర్ కి నోరెళ్ళ బెట్టి చూసింది. 89/5 ఉన్న దశలో వీరిద్దరూ కలిసి విధ్వంసం సృష్టించారు. జట్టు స్కోర్ కనీసం 150 పరుగులైనా వెళ్తుందా అనుకున్న తరుణంలో ఏకంగా 200 మార్క్ దాటించారు.
మ్యాచ్ తర్వాత కూడా శార్దూల్‌కు సుహానా ఖాన్ కంట్రాగ్స్ చేస్తూ కనిపించింది. ఇక ఈ మ్యాచ్ లో ఆర్సీబీ.. కేకేఆర్ మీద 81 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం షారుఖ్, కోహ్లీ కలిసి పఠాన్ సినిమాలో చిందిస్తూ ప్రేక్షకులని అలరించారు. మొత్తానికి నిన్న మొత్తం పండగల జరిగిన ఈ మ్యాచ్ లో శార్దూల బ్యాటింగ్.. షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఎంజాయ్ చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
.@iamsrk My Baby girl so beautifully grown up🌼 Jacymaa’s heart swells with so much Pride seeing our Princess Khan representing her franchise & giving the trophy herself for the first time 🤌🏼 Heart beated so fast when her name was announced 💜#SuhanaKhanpic.twitter.com/gTDB0YN73e
— ❥ Sнαн ᏦᎥ Ᏸ𝐢ω𝐢 𓀠 (@JacyKhan) April 7, 2023
Suhana Khan attended the match at the Eden Gardens. pic.twitter.com/fld6XpkGXX
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2023
Congratulations @KKRiders… Thank you for the amazing match! ✨#KKRvsRCB #SuhanaKhan pic.twitter.com/HwmIfAlbZb
— Suhana Khan (@SuhanaKhanClub) April 6, 2023