SS Thaman, SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు విజయం సాధించింది. అది కూడా మన సొంత గడ్డ హైదరాబాద్‌లో.. అయితే ఈ విజయానికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ హాజరు కావడం వల్ల ఎస్‌ఆర్‌హెచ్ గెలిచిందంటూ అభిమానులు అంటున్నారు..
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్‌లో బోణి కొట్టింది. వరుస పరాజయాల నేపథ్యంలో నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టి సీజన్ 16లో పాయింట్ల ఖాతాను తెరిచింది. వరుసగా రెండు భారీ ఓటముల తర్వాత సన్ రైజర్స్ ఇలాంటి ప్రదర్శన చేయడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సొంత గడ్డపై ఆదివారం అభిమానులను నిరాశపర్చకుండా అన్ని విభాగాల్లో రాణించి అదరగొట్టేసింది. ఆదివారం కావడంతో ఈ మ్యాచ్ చూడటానికి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా రావడం జరిగింది. అయితే.. ఈ మ్యాచ్‌కి ఎస్.ఎస్ థమన్ కూడా వచ్చి మన టీమ్ ని సపోర్ట్ చేస్తూ కనిపించాడు. థమన్ రావడం వలన మ్యాచ్ గెలిచానేమో అనిపిస్తుంది. అది ఎలాగంటే ?
టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పుడు ఏది పట్టుకున్న బంగారం అనేట్లుగా ఉంది. ఎక్కడ చూసినా ఇతని హవానే. మ్యూజిక్ ఇచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకోవడమే కాదు.. ఇటీవలే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో థమన్ ప్రాతినిధ్యం వహించిన మన తెలుగు జట్టు గెలిచింది. ఈ లీగ్ లో లావుగా ఉన్నప్పటికీ.. థమన్ చూపించిన ఎనర్జీకి మనం వావ్ అనాల్సిందే. సీసీఎల్ మన తెలుగు జట్టు గెలిచినా హైలెట్‌గా నిలిచింది మాత్రం ఈ మ్యూజిక్ డైరెక్టరే. ఇక ఇతను చేస్తున్న ఆహా ఇండియన్ ఐడల్ షో కూడా బాగా పాపులర్ అయింది. ఇదిలా ఉంటే.. నిన్న జరిగిన సన్ రైజర్స్ మ్యాచ్ గెలుపుకి థమన్ హాజరు కావడంతోనే సన్‌రైజర్స్ గెలిచిందని అభిమానులు అంటున్నారు. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. థమన్ ఎక్కడికి వచ్చినా.. ఏది చేసినా అక్కడ సందడి తో పాటుగా విజయం కూడా వరిస్తుంది అనే సెంటిమెంట్ మరొకసారి నిరూపించబడింది.
థమన్‌తో పాటుగా నిన్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపుడి, సింగర్ హేమ చంద్ర కూడా ఈ మ్యాచ్ కి హాజరయ్యారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 143 పరుగుల స్కోర్ మాత్రమే చేసింది. పంజాబ్ జట్టులో కెప్టెన్ శిఖర్ ధావన్(99) మాత్రమే ఒంటరి పోరాటం చేసాడు. హైదరాబాద్ బౌలర్లలో మార్కండే 4, ఉమ్రాన్ మాలిక్, జెన్సెన్ కి రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన సన్ రైజర్స్ మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ ని ముగించేసింది. త్రిపాఠి(74)జట్టుని ముందుండి నడిపించగా కెప్టెన్ మార్కరం (37) అతనికి అండగా నిలిచాడు. మొత్తానికి ఈ మ్యాచ్ కి థమన్ రావడం వలనే సన్ రైజర్స్ విజయాన్ని సొంతం చేసుకుంది అనే విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
THAMAN ANNA AND KAVYA AKKA🧡🤭😍🤗#OrangeFireIdhi #OrangeArmy#Srh pic.twitter.com/VdjubaMuqm
— RISER 22 (@mallesh___22) April 9, 2023