Sri Lanka, IPL 2023: ఇప్పటికే దుమ్ముదుమ్ము జరుగుతున్న ఐపీఎల్ 2023ను మరింత స్ట్రాంగ్ చేసేందుకు శ్రీలంక క్రికెటర్లు వచ్చేశారు. వారి రాకతో కొన్ని జట్ల బలం అమాంతంగా పెరిగిపోయింది.
ప్రస్తుతం ఐపీఎల్ 2023లో ఊహించని విధంగా థ్రిల్లింగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ సీజన్లలో పలువురు స్టార్ ప్లేయర్లు గాయాల కారణంగా ఐపీఎల్ 2023 నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు ఈ సారి ఐపీఎల్‌కి కాస్త కళ తప్పుతుందేమోనని భావించారు. కానీ జరుగుతున్న మ్యాచ్‌లను గమనిస్తే వినోదం మాత్రం నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. జోరుగా సాగుతున్న ఐపీఎల్‌లో ఇక శ్రీలంక ఆటగాళ్లు సైతం భాగం కానున్నారు. దేశం తరఫున సిరీస్‌లు ముగించుకున్న లంకేయులుకు రెడీ అయిపోయారు. ఐపీఎల్‌లో ఆడే లంక ఆటగాళ్ల సంఖ్య తక్కువే అయినా వీరి రాక మూడు జట్లకు బాగా కలిసిరానుంది. అవి ఏ జట్లు అని పరిశీలిస్తే..
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు.. రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. టెస్టులు, వన్డేల అనంతరం ఇటీవలే మూడు టీ20 మ్యాచ్‌లు ముగించుకొని ఐపీఎల్ కోసం నేడు భారత్ కి రానున్నారు. హసరంగా, తీక్షణ, పతిరానా, శనక, రాజపక్సా ప్రస్తుతం ఐపీఎల్ ల్లో శ్రీలంక ప్లేయర్లు. అయితే శ్రీలంక టీ20 జట్టులో లేని రాజపక్సా పంజాబ్ తరపున ఆడుతుండగా.. మిగిలిన వారు నేడు జట్టులో చేరనున్నారు. ఇక శ్రీలంక ప్లేయర్లు ఐపీఎల్‌కి రావడంతో చెన్నై, బెంగళూరు, గుజరాత్ జట్లకు అనుకూలంగా మారనుంది. ప్రస్తుతం బెంగళూరు జట్టుకి స్పిన్నర్ లేని కొరత స్పష్టంగా కనపడుతుంది. ప్రధాన స్పిన్నర్ హసారంగా లేకపోవడంతో కరణ్ శర్మని కచ్చితంగా కొనసాగలించాల్సిన పరిస్థితి వస్తుంది.
గతేడాది హసరంగా.. చాహల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ల లిస్టులో రెండో స్థానంలో నిలిచాడు. ఈ శ్రీలంక టాప్ స్పిన్నర్ ఆర్సీబీ జట్టులో చేరితే మరిన్ని విజయాలు సొంతమవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక తీక్షణ, పతిరానా చెన్నై జట్టులో ఎంట్రీ ఇవ్వనుండడం ఆ జట్టులో సంతోషాన్ని నింపనుంది. పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో తీక్షణ సిద్ధహస్తుడు. ఇక పతిరానా కూడా యార్కర్లతో చెలరేగిపోగలడు. అసలే బౌలింగ్ వనరులు లేక ఇబ్బంది పడుతున్న చెన్నై జట్టుకి వీరిద్దరూ చాలా కీలకం కానున్నారు. ఇక శ్రీలంక టీ20 కెప్టెన్ శనక ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలియమ్సన్‌కి రీప్లేస్ గా వచ్చిన శనక.. విధ్వంసకర బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. పట్టిష్టంగా ఉన్న గుజరాత్ జట్టులో శనక చేరితే హార్దిక్ సేనకు తిరుగుండదు. ఇప్పటికే అభిమానులకి కిక్ ఇస్తున్న ఐపీఎల్ 2023.. శ్రీలంక ప్లేయర్లు ఎంట్రీతో మరింతగా మాజా వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Aaaandddd he’s back😎#IPL2023 #rcb #PlayBold #hasaranga pic.twitter.com/XIiSivi3lf
— Namma Team RCB Official (@nammateamrcb) April 10, 2023